జనసేనకు తలనొప్పిగా మారిన కిరణ్ రాయల్ వ్యవహారం

తిరుపతి జనసేన ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్ రాసలీలలకు సంబంధించిన వీడియోలు ఒక్కొక్కటిగా లీక్ అవుతున్నాయి. ఇవి ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు ఆ పార్టీని షేక్ చేస్తున్నాయి. యువతితో కిరణ్ రాయల్ గడపడాన్ని నెటిజన్లు పోస్టులు పెట్టడం చర్చనీయాంశమైంది. వీడియోలో చూస్తే.. కిరణ్ రాయల్ ను కళ్లు మూసుకోమని చెప్పి.. అతని మెడలో గొలుసు వేసింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య సరస సంభాషణ జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలకు పాటలను జోడించి మరీ నెటిజన్లు షేర్ చేస్తున్నారు.

చిన్న ఆరోపణ దొరికితే టార్గెట్ చేసేందుకు సిద్ధంగా ఉన్న వైసీపీకి ఇప్పుడు అస్త్రం దొరికినట్టైంది. ఇప్పుడు ఆ పార్టీ నేతలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తున్నారు. పవన్ వైఖరిపై ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై ఇప్పటికే కిరణ్ రాయల్ వివరణ కూడా ఇచ్చారు. వివాదం మాత్రం ఆగడం లేదు. ఇటువంటి వ్యవహారాలను ఏ మాత్రం సహించని పవన్ కళ్యాణ్ ఇప్పుడేం చేయబోతున్నారు.. దీనిపైనే అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

మహిళ ఆరోపణలు ఏంటి?

జన సేన పార్టీ ఇంచార్జీ కిరణ్ రాయల్ పై లక్ష్మి అనే ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. తనను బెదిరించి, మోసం చేసి, అన్ని విధాలుగా వాడుకొని, కోటి రోపాయలకు పైగా డబ్బులు కాజేశాడని సదరు మహిళ ఆత్మహత్య చేసుకుంటాను అంటు వీడియో విడుదల చేసి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె ఆరోపణల ప్రకారం.. తిరుపతి బైరాగపట్టడుగు చెందిన లక్ష్మీ అనే మహిళకు కిరణ్ రాయల్ కు సన్నిహిత సంబంధం ఉందట… లక్ష్మి అనేక దఫాలుగా కోటి 20 లక్షల రూపాయల వరకు కిరణ్ రాయల్ కు అప్పు ఇచ్చిందట. ఈ డబ్బు వ్యవహారంలో 2022 సంవత్సరం నుంచి కిరణ్ రాయలకు లక్ష్మి మధ్య వివాదం జరుగుతోంది. తాజాగా లక్ష్మి వీడియో విడుదల చేస్తూ ఆ వీడియోలు తాను కిరణ్ రాయల్ తనను మోసం చేశారని తనను బెదిరించి 30 లక్షల రూపాయలకు చెక్కులు, బాండ్లు రాయించుకున్నారని ఆరోపించింది. డబ్బులు అడిగితే తన పిల్లలను చంపుతాడని బెదిరిస్తున్నానని పేర్కొన్నారు. కిరణ్ రాయల్ వలనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని.. తాను చనిపోయిన తర్వాత అయినా తన డబ్బులు తన పిల్లలకు చెందాలని కోరింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ప్రస్తుతం లక్ష్మీ ఆత్మహత్య చేసుకుని వేలూరు సీఎంసి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

కిరణ్ రాయల్ ఏమన్నారంటే.. ?

“వైసిపి దొంగల ముఠా నాపై కక్ష కట్టింది. వైసిపి నేతలు సోషియల్ మీడియా వేదికగా నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. క్రిమినల్ కిలాడీ లేడీ లక్ష్మితో నాపై నిరాధారణమైన ఆరోపణలు చేయిస్తున్నారు. కోటి 20లక్షల రూపాయలు నాకు ఇచ్చినట్లు లక్ష్మి దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. 2016సంవత్సరంలో 50లక్షల రూపాయల చీటీలు వేశాం. చీటీలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఎప్పుడో ముగిశాయి. వైసిపి నాపై ఆడుతున్న చిల్లర రాజకీయం. అప్పుల భాదతో మనస్థాపంతో లక్ష్మి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. లక్ష్మిపై గతంలో ఎన్నో కేసులున్నాయి. లక్ష్మిపై ఆరు కేసులున్నాయి..భూమన అభినయరెడ్డి నాపై చిల్లర రాజకీయాలు చేయిస్తున్నాడు. భూమన అభినయరెడ్డి లక్ష్మిని రెచ్చగొట్టి నాపై పనికిమాలిన ఆరోపణలు చేయిస్తున్నాడు. జగన్ రెడ్డిని చిట్టి రెడ్డి అని..భూమన కుటుంబంపై విమర్సలు చేసినందుకే నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. చిల్లర రాజకీయాలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. పెయిడ్ ఆర్టిస్టులతో ఆరోపణలు చేయినంత మాత్రాన అబద్థాలు నిజం కావు”..అని కిరణ్ రాయల్ అంటున్నారు.

పవన్ ఏం చేయబోతున్నారు..?

కిరణ్ రాయల్ , లక్ష్మికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. గతంలో జానీ మాస్టర్ విషయంలోనూ మహిళా కొరియోగ్రాఫర్ ఆరోపణలు చేసింది. జనసేన పార్టీలో ఉన్న జానీ మాస్టర్ పై చర్యలు తీసుకున్నారు పవన్ కళ్యాణ్. కూటమి ప్రభుత్వంలోని పలువురిపై ఇలాంటి ఆరోపణలు రావడం వైసీపీకి అస్త్రంగా మారింది. మరి కిరణ్ రాయల్ పై పవన్ కళ్యాణ్ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Latest Articles

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి

         ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా  తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్‌ చేసి దాడికి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్