ఆదిలాబాద్ మాదేనంటున్న కమలనాథులు

   ఆదిలాబాద్ ఇలాఖాలో కమలం వికసిస్తుందా..? కాషాయం జెండా ఎగురుతుందా..? అంటే అవుననే అంటున్నారు బీజేపీ శ్రేణులు. గత ఎన్నికల మాదిరే సీన్‌ రిపీట్‌ అవుతుందని.. ఇప్పుడు కూడా తమదే
గెలుపన్న ధీమాలో ఉన్నారు. మరి కమలనాథుల ఆశలు ఫలిస్తాయా.? బీజేపీ విక్టరీ కొట్టడం ఖామమేనా..?

   ఆదిలాబాద్‌ సెగ్మెంట్‌లో పార్లమెంట్‌ ఫైట్‌ హోరాహోరీగా సాగుతోంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ఎన్నికల రణరంగంలో సై అంటే సై అంటున్నాయి. దీంతో త్రిముఖ పోరు నెలకొంది. ఇక గెలుపే లక్ష్యంగా పార్టీ నేతలు వ్యూహాత్మకంగా ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ముందుకు సాగుతున్నారు. అయినప్పటికీ ఈసారి కూడా తమదే విజయన్న ధీమాలో ఉన్న కమలనాథులు.. ఆ దిశగా పావులు కదుపుతున్నారు. లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుం డటంతో బీజేపీ ప్రచారంలో దూకుడు పెంచింది. కాంగ్రెస్‌, బీఆరా్‌ఎస్‌ వైపల్యాలను ప్రజల్లో ఎండగడుతూ ప్రజల్లో పలుచన చేసే పనిలో పడింది. ముఖ్యంగా కాంగ్రెస్‌ సర్కార్‌ను టార్గెట్‌ చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్న విమర్శలు గుప్పిస్తోంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్‌ పార్లమెంట్ సెగ్మెంట్‌ నుంచి నాలుగు నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు గెలవడంతో.. ఈ ఎన్నికల్లోనూ విజయం తమదేనంటున్నారు కమల నాథులు. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో ఆయా నియోజకవర్గాల్లోని స్థానిక సంస్థల నేతలు హస్తం గూటికి చేరిపోవడం కొంత బీజేపీకి బలం తగ్గే అవకాశం ఉన్నప్పటికీ.. కమలనాథులు మాత్రం గెలుపుపై ఆశాభావంలో ఉన్నారు. ఇక మరోపక్క కోల్పోయిన ఆదిపత్యాన్ని బీఆర్‌ఎస్‌ తిరిగి సంపాదించుకోవాలన్న తపనలో ఉంది. అందుకు తగ్గట్టుగా గట్టి ప్రయత్నాలు చేస్తోంది.

    ఇకపోతే 2019లో ఆదిలాబాద్ పార్లమెంట్‌ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు త్రిముఖ పోటీ ఉన్నప్ప టికీ.. బీజేపీనే విజయం సాధించి పీఠాన్ని కైవసం చేసుకుంది. 7 నియోజకవర్గాలకు గాను అసెంబ్లీ సెగ్మెంట్‌లో 4 బీజేపీ, 2 బీఆర్‌ఎస్‌, ఒకటి కాంగ్రెస్‌ సొంతం చేసుకున్నాయి. సిర్పూర్‌, ముధోల్‌లో బీఆర్‌ ఎస్‌ రెండో స్థానంలో నిలువగా ఆ పార్టీ నుంచి ఓడిపోయిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఇటీవల కాంగ్రెస్‌లో చేరడంతో ప్రస్తుతం ఆదిలాబాద్‌లో త్రిముఖ పోటీ ఛాయలు కనిపిస్తున్నాయి. అయితే పోలింగ్‌ సమయా నికి పరిణామాలు మారి, పరిస్థితి తారుమారయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావి స్తున్నారు . మరి కమలనాథులు ఆశిస్తున్నట్టు ఆదిలాబాద్‌లో కాషాయం జెండా ఎగురు తుందా..? బీజేపీ వ్యూహాలు ఫలిస్తాయా..? అసలు ఆదిలాబాద్‌ బాద్‌షా ఎవరన్నది తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకూ వేచి చూడాల్సిందే.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్