26.2 C
Hyderabad
Tuesday, February 10, 2026
spot_img

అక్రమ కట్టడాలపై మున్సిపాలిటీ అధికారుల ఉక్కుపాదం

   పశ్చిమ గోదారి జిల్లా నర్సాపురంలో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. మున్సిపాలిటీ అధికారులు కొరడా ఝుళిపిస్తుండటంతో హడెలెత్తిపోతున్నారు. ఇన్నాళ్లు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగిన అక్రమ దందాపై అధికా రులు ఉక్కపాదం మోపడంతో యథేచ్చగా సాగిస్తున్న దందాకు కళ్లెం పడింది.

    పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం అక్రమ కట్టడాలకు అడ్డాగా మారింది. రాజకీయ నేతలు పలుకుబడి, అండదం డలంతో యథేచ్చగా సాగిస్తున్న దందాపై మున్సిపాలిటీ అధికారులు ఉక్కుపాదం మోపడంతో బెంబేలెత్తిపోతున్నారు అక్రమార్కులు. 180 మందిపై చర్యలకు సిద్ధమయ్యారంటే ఏ మేర అక్రమాలు జరుగుతున్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అయితే మున్సిపాలిటీలో భవనాలు నిర్మించా లంటే అధికారుల పర్మిషన్‌ కంపల్‌సరి. అలాంటి అనుమతు లేమీ లేకుండా రాజకీయ పలుకుబడిని వాడుకుంటూ అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారు. గత ఐదేళ్లుగా ఇదే తీరు సాగింది. అయితే ప్రభుత్వం మారడంతో ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పుడు మరో లెక్క అన్నట్టు మున్సిపాల్ అధికారు లు కొరడా ఝుళిపి స్తున్నారు. అక్రమ కట్టడాలపు ఉక్కుపాదం మోపుతున్నారు. దీంతో ఒక్కొక్కటిగా అనుమతు లు లేని నిర్మాణాలు బయటపడుతున్నాయి. దీంతో చర్యలకు పూనుకుంటు న్నారు ఆఫీసర్లు.అక్రమ కట్టడా లను అరికట్టేందుకు రంగంలోకి దిగిన మున్సిపాలిటీ అధికారులు 180 మందికి నోటీసులు జారీ చేశారు. వీరిలో 98 మంది భవన యజమా నులకు కోర్టు నోటీసులను అందించగా 13 మందిపై చార్జ్‌ షీట్ దాఖలు చేశారు. మరొకరికి లక్షా 78 వేల రూపాయలకుపైగా జరిమానా విధించారు. అయితే పట్టణంలోని ప్రజలందరూ భవన నిర్మాణాలు చేపట్టే ముందు, స్థలాలు కొనే ముందు వాటికి అనుమతులు ఉన్నాయా లేవా? ఆ భవనాలు టౌన్ ప్లానింగ్ అధికారులు అనుమతులు ఇచ్చారా లేదా చూసుకొని కొనుగోలు చేసుకో వాలని మునిసిపల్ కమిషనర్ డాక్టర్‌ కె.వెంకటేశ్వరరావు సూచించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్