నేడు టీడీపీ – జనసేన అభ్యర్థుల తొలిజాబితా విడుదల

  టీడీపీ, జనసేన పార్టీల తరఫున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా కాసేపట్లో విడుదల కానుంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఒకే వేదికపై నుంచి అభ్యర్థుల పేర్లను ప్రకటించను న్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నిమ్మల రామా నాయుడు, యనమల రామకృష్ణుడు, నక్కా ఆనంద్‌బాబు, గొట్టిపాటి రవి, అనగానితో సమావేశమ య్యారు. టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్న నేపథ్యంలో ఇరు పార్టీల నేతల్లో ఉత్కంఠ నెలకొంది.

    టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఒకే వేదికపై నుంచి అభ్యర్థుల పేర్లను ప్రకటించ నున్నారు. ఈ కార్యక్రమంలో ఇరుపార్టీల సీనియర్‌ నేతలు పాల్గొననున్నారు. ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయడంపై కొంతకాలం కిందటే స్పష్టత వచ్చింది. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ పలుసార్లు సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిపి నడు స్తామని, పొత్తుపై చర్చలు జరుగుతున్నాయని రెండు పార్టీల నేతలు చెబుతున్నా ఇంకా స్పష్టత రాలేదు. ఈ విషయం వచ్చే వారం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈలోగా ఇరు పార్టీల నుంచి కొందరు అభ్యర్థుల ఎంపికపై అయినా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని నిర్ణయించారు.

     వైసీపీ ఇప్పటికే నియోజకవర్గ సమన్వయకర్తల పేరుతో ఏడు జాబితాలు విడుదల చేసింది. అక్కడ తమ పార్టీ అభ్యర్థులు వారేనని సంకేతాలిస్తోంది. టీడీపీ, జనసేన పార్టీలు కూడా నియోజకవర్గ నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ.. కొందరికి బాగా పనిచేసుకోవాలని సూచిస్తున్నాయి. అయితే ఎక్కడా అభ్యర్థుల పేర్లను మాత్రం ప్రకటించలేదు. ఇవాళ మంచి రోజు కావడంతో తొలి జాబితా విడుదల చేస్తే.. పార్టీ కార్యక ర్తలు, నేతలు ఉత్సాహంగా పనిచేస్తారని అధినేతలు భావిస్తున్నారు. బీజేపీతో పొత్తును దృష్టిలో ఉంచు కుని ఆ పార్టీకి ఆసక్తి ఉన్న స్థానాలు కాకుండా.. మిగిలిన సీట్లలో కొన్నింటికి అభ్యర్థుల్ని ప్రకటించనున్నా రు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్