స్వతంత్ర వెబ్ డెస్క్: చంద్రబాబు అరెస్టుపై స్పందించడానికి సినీ ఇండస్ట్రీ భయపడుతోందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టుపై సినీ ఇండస్ట్రీ స్పందించకపోవడంపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలో మాట్లాడుతూ… ‘ఇండస్ట్రీలోని వారు పొలిటికల్ హీట్ ను తీసుకోలేరు. చాలా ఒత్తిడి ఉంటుంది. అందుకే స్పందించడానికి భయపడుతున్నారు. ఎవరైనా మాట్లాడితే వైసిపి నేతలు టార్గెట్ చేస్తారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆయనకు వ్యతి రేకంగా సినిమాలు తీసిన కక్ష సాధింపు జరగలేదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు’ అని పేర్కొన్నారు. అంతే కాక, నాలుగో విడత వారాహి యాత్ర సక్సెస్ అయినట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ముఖ్యంగా కొల్లేరు ప్రాంతంలో సమస్యలు తనకెంతో బాధ కలిగించినట్లు పవన్ తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వాలు మారినప్పుడల్లా కాంటూరు మార్పు అంశం తీవ్రంగా బాధించిందన్నారు. అలాగే బందరులో జరిగిన జనవాణి కార్యక్రమంలో కాంట్రాక్టు ఉద్యోగుల సమస్య తన దృష్టికి వచ్చిందన్నారు.
ఆ విషయంలో సినీ ఇండస్ట్రీ భయపడుతోంది- పవన్
0
414
Previous article
Next article
Latest Articles
హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


