అందుకే.. సీఎం జగన్ ను రాళ్లతో తరిమి కొట్టారు- పవన్ కళ్యాణ్

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ(Telangana) ఏర్పాటు కోసం మలిదశ ఉద్యమం విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఏపీ సీఎం జగన్‌(CM Jagan)ను మరోసారి టార్గెట్ చేశారు. జగన్ చేసిన పనుల వల్లే ఆంధ్రా నాయకులను హైదరాబాద్ నుండి తరిమేశారని ఇది వరకు ఆరోపించిన పవన్ కళ్యాణ్.. ఈ విషయంలో వెనక్కితగ్గడం లేదు. ఈ సారి విమర్శల్లో మరింత డోస్ పెంచాడు. తాజాగా మాట్లాడిన పవన్ కళ్యాణ్.. తెలంగాణ సహజ వనరులను(Natural Resources), భూములను వైఎస్సార్ ఫ్యామిలీ(YSR Family) అడ్డగోలుగా దోచుకున్నారని ఆరోపించారు.

వైఎస్సార్ సీఎం అయ్యాక పర్యావరణానికి సంబంధించి, సహజ వనరుల దోపిడి, ప్రభుత్వ ఆస్తుల దోపిడీ విపరీతంగా పెరిగిందన్నారు. అంతకు ముందు పర్యావరణ విధ్వంసానికి కిటికీ అంతా ప్రవేశం ఉంటే వైఎస్సార్ వచ్చాక ద్వారబంధాలు లేకుండా దోచుకున్నారని.. అందువల్లే తెలంగాణ ప్రజల్లో ఆంధ్ర వారి పట్ల కోపం పెరిగిందన్నారు. ఈ కోపానికి కారణాల్లో వైఎస్ జగన్ కూడా ఒకరని.. అందుకే వరంగల్ మానుకోటలో జగన్ దిగుతుంటే స్టేషన్లోనే తెలంగాణ విద్యార్థులంతా రాళ్లతో తరిమి కొట్టారని ఆరోపించారు. 2004లో వైఎస్సార్ హయాంలో ఏ దోపిడి జరిగిందో అదే దోపిడి ఇప్పుడు జగన్ కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు.

Latest Articles

కేసీఆర్ తిరిగి సీఎం కావాలని ప్రజలు నిజంగానే కోరుకుంటున్నారా?

తెలంగాణ రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితి సరికొత్త మైండ్ గేమ్‌కు తెరతీసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. కేటీఆర్, హరీశ్ రావు ద్వయం ఒక కొత్త...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్