TS TET Results 2023: టెట్‌ ఫలితాలు విడుదల..!

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET) ఫలితాల విడుదలయ్యాయి.. బుధవారం (సెప్టెంబర్‌ 27) ఉదయం  10 గంటలకు ఈ ఫలితాలను అధికారులు విడుదల చేశారు.టెట్‌ కన్వీనర్‌ రాధారెడ్డి వెల్లడించారు. ఫలితాలు  వెబ్‌సైట్‌లో  https://tstet2023results.cgg.gov.in/tstet2023pkgr1510.results అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.  కాగా ఈ నెల 15న రాష్ట్రవ్యాప్తంగా 2,052 కేంద్రాల్లో టెట్‌ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్ష కోసం దాదాపు 4,78,055 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. పేపర్‌-1కు 2.26 లక్షలు(84.12శాతం), పేపర్‌-2కు 1.90 లక్షల మంది (91.11 శాతం)  హాజరయ్యారు.

ఇక ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులు కావాలంటే టెట్‌లో క్వాలిఫై కావడం తప్పనిసరి అని తెలిసిందే. దీని కాలపరిమితి జీవితకాలం ఉంటుంది. టెట్‌ పేపర్-1లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ఎస్జీటీ పోస్టులకు.. పేపర్‌ 2లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆరు నుంచి 8వ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులు.

Latest Articles

ప్రభాస్.. షాకింగ్ అనౌన్స్ మెంట్..

బాహుబలి మూవీ ఓ చరిత్ర. ఒక కథను రెండు భాగాలుగా చెప్పచ్చు.. అలా చెప్పడం ద్వారా బ్లాక్ బస్టర్ సాధించవచ్చు.. అని నిరూపించింది దీంతో సీక్వెల్స్ ట్రెండ్ ఊపందుకుంది. స్టార్ హీరోలే కాదు.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్