36.2 C
Hyderabad
Tuesday, May 12, 2026
spot_img

బీజేపీ దూకుడుతో బీఆర్ఎస్ పార్టీలో టెన్షన్ మొదలయిందిగా…

బీజేపీ దూకుడుతో బిఆర్ఎస్ పార్టీలో టెన్షన్ మొదలయిందా…? వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే అంటూ మోదీ చేసిన వ్యాఖ్యలు కారు పార్టీలో కల్లోలం రేపుతోందా…? చంద్రబాబు, మోదీ మీటింగ్ తో గులాబీ బాస్ అలెర్ట్ అయ్యారా…? అసలు గులాబీ దళానికి బీజేపీ టెన్షన్ ఎందుకు…? ఈ అంశంపై కారు పార్టీ వర్గాల్లో ఏం చర్చ జరుగుతోంది…?

తెలంగాణలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మూడు పార్టీల మధ్య ట్రయాంగిల్ ఫైట్ నడుస్తోంది. ఒక్కసారిగా తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచడంతో గులాబీ పార్టీలో టెన్షన్ మొదలయింది. వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే అంటూ ప్రధాన మంత్రి మోదీ చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయ్యాయి. దీంతో గులాబీ పార్టీలో గుబులు రేపుతోంది అనే చర్చ జరుగుతోంది. ఇక ప్రధాన మంత్రి మోదీ తెలంగాణ టూర్ తో బిఆర్ఎస్ పార్టీకి బీజేపీ టెన్షన్ పట్టుకుంది అనే ప్రచారం నడుస్తోంది. హైదరాబాద్ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ప్రధాన మంత్రి భేటీ మాత్రం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

దక్షిణాదిలో కర్ణాటక తర్వాత తాము అధికారంలోకి వచ్చే రాష్ట్రం తెలంగాణ అని బీజేపీ భావిస్తోంది. ఎప్పటి నుంచో తెలంగాణలో పాగా వేయాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. 2020 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 కార్పోరేటర్ స్థానాలను బీజేపీ గెలిచింది. 2024 లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో 8 ఎంపీ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. దీంతో తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో గెలుస్తామనే ధీమాను బీజేపీ వ్యక్తం చేస్తోంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. బీజేపీ బలోపేతం అయితే బిఆర్ఎస్ కు రాజకీయంగా నష్టం తప్పదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అందుకే మోదీ పర్యటన తర్వాత తెలంగాణ రాజకీయాలు ఏ విధంగా టర్న్ తీసుకుంటాయి అనే దానిపై బిఆర్ఎస్ పార్టీలో అంతర్గత చర్చ నడుస్తోంది.

తాజాగా తెలంగాణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటికి మోదీ వెళ్లి దాదాపు గంట సేపు అక్కడే ఉన్నారు. ఇక ఏపీలో రాజకీయ పరిణామాలు,అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించడంతో పాటు తెలంగాణ రాజకీయాలపై చంద్రబాబుతో మోదీ చర్చించినట్లుగా తెలుస్తోంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బిఆర్ఎస్ పార్టీ పైన ఇద్దరి మధ్య చర్చ జరిగి ఉంటుందని పొలిటికల్ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి చర్చ ఇద్దరి మధ్య జరిగి ఉంటుంది అనే దానిపై ఆరా తీస్తున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలను, లోక్ సభ ఎంపీని కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. ఇక ఓటుకు నోటు కేసు లాంటి పరిణామాల తర్వాత చంద్రబాబు అమరావతికి షిఫ్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది. దీంతో అప్పటి నుంచి బిఆర్ఎస్ పార్టీ, టీడీపీల మధ్య శతృత్వం పెరిగింది. ఇప్పటికీ సందర్భం వచ్చినప్పుడల్లా టీడీపీ టార్గెట్‌గా గులాబీ పార్టీ విమర్శలు చేస్తూ వస్తోంది. అంతే కాకుండా తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలని సీబీఐకి ఇచ్చింది. అదే విధంగా విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంపైన జరిగిన నిర్ణయాలపై విచారణ చేయాలని సిబిఐకు ఇచ్చింది. దీంతో సిబిఐ విచారణపై తెలంగాణలో ఉత్కంఠ నెలకొంది.

త్వరలో గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలో మూడు కార్పోరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా పోటీ చేస్తాయనే టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే పోటీ అధికార కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కూటమిగా మారే అవకాశం ఉంటుంది. గత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రానప్పటికీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం మెజరిటీ స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలకు రెడీ అవుతోంది. ఇక మోదీ, చంద్రబాబు మీటింగ్ తర్వాత గులాబీ బాస్ కేసీఆర్ అలెర్ట్ అయ్యారు. ఎర్రవెల్లిలో పార్టీ ముఖ్య నేతలతో మీటింగ్ ఏర్పాటు చేశారు. పైకి సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణం అని అంటున్నప్పటికీ మోదీ పర్యటనలో చంద్రబాబు ఇంటికి వెళ్లడం లాంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీంతో మోదీ, చంద్రబాబు భేటీ సందర్భంగా తెలంగాణ రాజకీయాలపై ఏం చర్చించారు?. భవిష్యత్తులో బిఆర్ఎస్ ఎలాంటి పాత్ర పోషించాలి? అనే దానిపై కేసీఆర్ గులాబీ నేతలకు దిశానిర్దేశం చేసే ఛాన్స్ ఉంది.

మొత్తానికి ప్రధాన మంత్రి మోదీ హైదరాబాద్ పర్యటన ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీని అలెర్ట్ చేసింది. రాబోయే రోజుల్లో బీజేపీ టార్గెట్ గా బీఆర్ఎస్ వ్యూహాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి.

Latest Articles

మాస్ రాజా.. నయా ప్లాన్ వర్కవుట్ అయ్యేనా..?

మాస్ మహారాజా రవితేజకు కథ నచ్చితే చాలు.. ఆ డైరెక్టర్ సక్సెస్ లో ఉన్నాడా..? ఫ్లాపుల్లో ఉన్నాడా..? అనేది చూడకుండా సినిమా చేసేస్తుంటారు. అయితే.. మాస్ రాజా.. ఇటీవల స్టోరీ సెలెక్షన్స్ లో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్