విజయవాడలోని సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీపీ కాంతి రాణాను కలిసేందు కు వడ్డెర కుల సంఘం నేతలు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు. అనుమతి లేదంటూ వారిని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సీఎం జగన్‌పై గులకరాయి దాడి కేసులో పోలీసులు దుర్గా రావును తీసుకెళ్లారంటూ.. అతడిని చూపించాలంటూ భార్య, కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. తన భర్త ఏ తప్పూ చేయలేదని, పోలీసుల వద్ద ఎలాంటి సాక్ష్యాలు లేనందునే అతడిని దాచిపెట్టారని భార్య ఆరోపించారు. దీంతో ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపు లోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.
విజయవాడలోని సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
0
267
Previous article
Next article
Latest Articles
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సీనియర్ల అసంతృప్తి
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే తీవ్ర స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, అంతర్గతంగా సీనియర్ నాయకుల అసంతృప్తి వ్యవహారం పెద్ద...
- Advertisement -
- Advertisement -


