రాహుల్ గాంధీ పై అనర్హత వేటు ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే: వై.ఎస్. షర్మిల

YS Sharmila |కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై అనర్హత వేటు ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే అని పేర్కొన్నారు వైఎస్ఆర్టీపీ అధినేత్రి వై.ఎస్. షర్మిల. వాదనలు వినిపించేందుకు 30 రోజుల సమయం ఉన్నా… రాహుల్ గాంధీకి లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం నిరంకుశ చర్య అని ట్విట్టర్ లో మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో అధికారపక్షం ఎంత ముఖ్యమో.. ప్రతిపక్షం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. రాజకీయ వైరుధ్యాల కంటే రాజ్యాంగ విలువలు గొప్పవని… బీజేపీ చర్యలు ప్రజాస్వామ్యానికి మచ్చతెచ్చేలా ఉన్నాయని నిప్పులు చెరిగారు.

ప్రతిపక్షాల గొంతునొక్కడం, కక్షసాధింపు చర్యలకు దిగడం ప్రజాస్వామ్యంలో తగదన్నారు.. పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సాధించుకున్న స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవాలన్నా, రాసుకున్న రాజ్యాంగం అమలు కావాలన్నా ఈ నిరంకుశ నిర్ణయాన్ని ముక్త కంఠంతో ఖండించడం ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క పౌరుని బాధ్యత అని షర్మిల(YS Sharmila) గుర్తుచేశారు.

Read Also: కోలుకుంటున్నా.. ఆరోగ్యంపై తాజా అప్టేడ్ ఇచ్చిన సమంత

Follow us on:   Youtube   Instagram

Latest Articles

breaking: కార్మికులపై పడ్డ ద్రవ ఉక్కు…8 మంది కార్మికులు మృతి

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 8 మంది కార్మికులు చనిపోయారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్టీల్​ప్లాంట్ మెటల్ లిక్విడ్ లాడిల్ పేలడంతో ప్రమాదం సంభవించింది. సీసీడీ విభాగంలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్