తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ శుభవార్త.. రాష్ట్ర తలసరి ఆదాయం ఎంతంటే?

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్(CM KCR) శుభవార్త తెలిపారు. రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 3.08 లక్షలుగా ఉన్నట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రతి సంవత్సరం నిర్వహించే ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం.. ఈ విషయాన్ని వెల్లడించారు. అంతకు ముందు విందులో పాల్గొన్న సీఎం(CM KCR)… మొదట అనాథ పిల్లలతో కాసేపు ముచ్చటించారు. వారి యోగక్షేమాలతో పాటు.. వారి చదువును అడిగి తెలుసుకున్నారు. వారితో మాట్లాడుతూ.. తొమ్మిది పదేళ్ళ క్రితం మనల్ని వెనుకబడినవారిగా అన్నారని.. కానీ ఇప్పుడు ఆ అల్లా దయతో తెలంగాణ రాష్ట్రానికి పోటీ లేదని తెలిపారు. ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు.. కేంద్ర సర్కారే పార్లమెంట్ వేదికగా వెల్లడించిందని అన్నారు. మన రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 3,17,115 ఉందని… గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక వంటి పెద్ద రాష్ట్రాలకంటే మనమే ముందంజలో ఉన్నామని అన్నారు. రాష్ట్రం సిద్దించిన కొత్తలో తలసరి విద్యుత్ వినియోగం 1000 – 1050 యూనిట్లు ఉండేదని… ఇప్పుడు అది రెండింతలు పెరిగి 2100 యూనిట్లకు చేరుకున్నదని వెల్లడించారు.

Read Also: కల్తీ కల్లు కలకలం.. 40 మందిలో ముగ్గురు మృతి

Follow us on:  YoutubeKooGoogle News

Latest Articles

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు షాక్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు తెలంగాణ పోలీసులు షాక్ ఇచ్చారు. మంగళవారం తలపెట్టిన జనసేన సభకు అనుమతి నిరాకరించారు. రేపు రాష్ట్రంలో పార్టీ నవ నిర్మాణ సంకల్ప సభ ప్లాన్ చేసుకుంది...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్