కల్తీ కల్లు కలకలం.. 40 మందిలో ముగ్గురు మృతి

మహబూబ్ నగర్(Mahabubnagar) జిల్లాలో కల్తీ కల్లు కలకలం రేపింది. జిల్లాలో ఇటీవలే దాదాపు 40 మంది వింత ప్రవర్తన, వాంతులు, విరేచనాలు, కాళ్లు చేతులు వంకర్లు పోవడం వంటి లక్షణాతో ఆస్పత్రి పాలవ్వగా… ఇందులో ముగ్గురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి తీవ్ర విషమంగా ఉండటంతో హైదరాబాద్ లోని నిమ్స్ కి తరలించారు. అయితే వీరంతా కల్తీ కల్లు తాగటం వల్లే ఇలా అనారోగ్యం పాలయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మృతులు కోడూరుకు చెందిన ఆశన్న ఆదివారం రాత్రి మృతి చెందగా.. మహబూబ్‌నగర్‌లోని అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన విష్ణుప్రకాశ్ మంగళవారం రాత్రి మరణించారు. తాజాగా, కోడూరు గ్రామానికి రేణుక అనే మహిళ మృత్యు ఒడికి చేరింది.

ఈ ఘటనపై ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందిస్తూ.. కల్తీకల్లు వల్ల వీరు మృతి చెందలేదని, అనారోగ్యం కారణంగానే మృతి చెందారని తెలిపారు. వైద్య పరీక్షల్లోనూ డాక్టర్లు ఇదే తేల్చారని పేర్కొన్నారు. శవ పరీక్ష కోసం వీరి వద్ద నుండి నమూనాలు సేకరించి, ఫోరెన్సిక్ కు పంపామన్నారు. రిపోర్ట్ లో కల్తీ కల్లు కారణంగానే చనిపోయారని  తేలితే.. బాద్యులను ఎట్టి పరిస్థితులలో విడిచిపెట్టేది లేదన్నారు.

Read Also: కవిత-సుకేశ్ వాట్సాప్ చాట్ పై ఈడీకి రఘునందన్ ఫిర్యాదు

Follow us on:  YoutubeKooGoogle News

Latest Articles

కమర్షియల్ సిలిండర్లపై మరోసారి బాదుడు

దేశంలో మరోసారి కమర్షియల్ సిలిండర్లపై భారీగా ధరలు పెరిగాయి. దీంతో వ్యాపార వర్గాలపై గ్యాస్ భారం మరింత పెరిగింది. ఇవాళ్టి నుండి దేశవ్యాప్తంగా 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలను చమురు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్