తెలంగాణ లోక్‌సభ ఫలితాల్లో కాంగ్రెస్‌, బీజేపీల మధ్య హోరాహోరీ


పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్-బీజేపీల మధ్య టఫ్ ఫైట్ నెలకొని ఉంది. కాంగ్రెస్‌, బీజేపీల మధ్య హోరా హోరీగా పోటీ పడుతుండగా.. బీఆర్‌ఎస్‌కు తీవ్ర నిరాశే ఎదురయింది. ప్రస్తుతం కాంగ్రెస 8 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు 8 స్థానాల్లో లీడ్‌లో ఉన్నారు. ఒక స్థానంలో ఎమ్ఐఎం లీడ్‌లో ఉన్నాయి. నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, మల్కాజ్‌గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్, ఆదిలాబాద్‌లో బీజేపీ ఆధిక్యం కనబరుస్తుండగా, జహీరాబాద్, పెద్దపెల్లి, మహ బూబాబాద్, నల్లగొండ, ఖమ్మం, భువనగిరి, వరంగల్, నాగర్ కర్నూల్ స్థానాల్లో కాంగ్రెస్‌ లీడ్‌లో ఉంది. హైదరాబాద్‌లో MIM అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ, మెదక్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి లీడ్‌లో కొనసాగుతున్నారు.

ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి భారీ ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ఆరో రౌండ్ ముగిసేసరికి ఆయన 1.26 లక్షల ఓట్ల మెజార్టీతో దూసుకెళ్తున్నారు. మహబూబాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు. నాలుగో రౌండ్ ముగిసే సరికి 33 వేల 753 ఓట్ల మెజార్టీతో ముందజలో ఉన్నారు. కరీంనగర్‌లో బండి సంజయ్ 39 వేల 319 ఓట్ల మెజార్టీతో ముందంజ లో ఉన్నారు. సికింద్రాబాద్‌లో కిషన్ రెడ్డి 12 వేల 212 ఓట్ల మెజార్టీతో లీడ్‌లో కొనసాగు తున్నారు. నల్గొండ లో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. తొలి రౌండ్ ముగిసేసరికి రఘువీర్ రెడ్డి 2 వేల పై చిలుకు ఓట్ల మెజార్టీతో దూసుకెళ్తున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ ముందంజలో ఉన్నారు. భువనగిరి పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి లీడ్‌లోకి వచ్చారు. పోస్టల్ బ్యాలెట్ ఓటల్లో బీజేపీ అభ్యర్థి ముందంజలో ఉండగా ఈవీఎం ఓట్ల లెక్కింపులో చామల రేసులోకి వచ్చారు. మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఈటల దూసుకెళ్తున్నారు.

Latest Articles

జగన్‌కు మంత్రి లోకేష్‌ సవాల్

మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు మంత్రి లోకేష్‌ సవాల్ విసిరారు. జగన్‌ ఇంటికి 200 మీటర్ల దూరంలో ఉన్నానని.. డీఎస్సీపై అనుమానాలుంటే సమాధానం చెప్తానని అన్నారు. ధైర్యం ఉంటే చర్చకు రావాలని సవాల్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్