Telanagana new secreteriat opening postphone: సీఎం కేసీఆర్ పుట్టినరోజు జన్మదినం సందర్భంగా ఫిబ్రవరి 17న కొత్త సచివాలయం ప్రారంభోత్సవం చేయాలని నిర్ణయించారు. ఆరోజు వేదపండితుల ఆధ్వర్యంలో వాస్తు పూజ, చండీయాగం, సుదర్శన యాగం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి.
పూజా సామగ్రి రెడీ అయిపోయింది. ఎక్కడెక్కడి నుంచో పండితులు రిజర్వేషన్లు చేయించుకుని సిద్ధమవుతున్నారు. ప్రారంభోత్సవాన్ని ప్రపంచమంతా చూసేలా, అబ్బురపడేలా ఈవెంట్స్ ప్లాన్ చేశారు. వచ్చిన అతిథులందరికి భోజనాలకు భారీ పిండివంటలతో ఆర్డర్లు ఇచ్చేశారు. అందరూ సరుకులు కొనుక్కొని వంటపాత్రలు శుభ్రం చేసుకునే పనిలో పడ్డారు. మొత్తానికి విషయం తెలిసి ఒక్కసారి అందరూ ఉస్సూరుమన్నారు.
ఇక ప్రారంభోత్సవానికి తమిళనాడు సీఎం స్టాలిన్, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ తరపున జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్, డా బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ తదితర ప్రముఖులు హాజరవనున్నారు. వీరందరికీ మళ్లీ మెయిల్స్, ఫోన్లు చేసే హడావుడిలో ఉన్నతాధికారులు, రాజకీయ ప్రముఖులు గజిబిజీగా తిరుగుతున్నారు.
సచివాలయం ప్రారంభోత్సవం తర్వాత పెరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ కూడా ప్లాన్ చేశారు. అది కూడా పక్కకి వెళ్లిపోయింది. ఆ ఏర్పాట్లు చూసేవాళ్లందరిలో ఒక్కసారి నీరసం వచ్చేసింది. ఇప్పుడీ సామాన్లనీ పట్టుకుని ఎక్కడికి వెళ్లాలి? ఎక్కడ పెట్టాలి? అన్నిరోజులు అద్దెలు ఎలా కట్టాలి? మళ్లీ ఇచ్చేయాలంటే ట్రాన్స్ పోర్ట్ ఎలా భరించాలి? లాభం గూబల్లోకి వచ్చేలా ఉందని ప్రారంభోత్సవ ఏర్పాట్లలో నిమగ్నమైన అందరూ లబోదిబోమంటున్నారు.