37.2 C
Hyderabad
Thursday, May 14, 2026
spot_img

టీ 20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా జైత్రయాత్ర

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ సెమీఫైన‌ల్లో భార‌త జ‌ట్టు అడుగుపెట్టింది. ఆస్ట్రేలియాతో సూపర్‌-8 చివరి మ్యాచ్‌లోనూ నెగ్గిన రోహిత్‌ సేన. అజేయంగా సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది.లూసియా వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచ్‌లో 24 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించిన భార‌త్ గ్రూపు-1 నుంచి త‌మ సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల న‌ష్టానికి 205 ప‌రుగులు చేసింది. భార‌త బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ 92 రన్స్ తో టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా సూర్యకుమార్‌ యాద‌వ్‌ 31, శివ‌మ్ దూబే 28 ప‌రుగుల‌తో రాణించా రు. సూర్యతో పాటు దూబె, హార్దిక్‌ సమయోచితంగా రాణించి స్కోరును 200 దాటించారు. 206 పరుగుల భారీ లక్ష్యం తో బరిలోకి దిగిన ఆసీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 181 పరుగులు మాత్రమే చేయగల్గింది. భారత బౌలర్ల లో అర్ష్‌దీప్ ‌ సింగ్‌ మూడు వికెట్లు పడగొట్టగా కుల్దీప్‌ యాదవ్‌ రెండు, బుమ్రా, అక్షర్‌ పటేల్‌ తలా ఒక్క వికెట్‌ సాధించా రు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్‌, స్టోయినిష్ త‌లా రెండు వికెట్లు సాధించ‌గా హాజిల్ వుడ్ త‌లా వికెట్ ప‌డ‌గొట్టారు.ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైన ఆస్ట్రేలియా అఫ్గానిస్తాన్‌-బంగ్లాదేశ్ ఫలితం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆస్ట్రేలియా భవితవ్యం అఫ్గానిస్థాన్‌-బంగ్లాదేశ్‌ ఫలితం మీదే ఆధారపడి ఉంది.బంగ్లాదేశ్‌పై అఫ్గానిస్తాన్ గెలిస్తే ఆసీస్ ఇంటిముఖం పడుతోంది. గ్రూపు-1 నుంచి రెండో జట్టుగా అఫ్గానిస్తాన్ సెమీస్‌కు చేరుతోంది. గురువారం సెమీస్‌లో భారత్‌ ఇంగ్లాండ్‌ను ఢీకొం టుంది.

Latest Articles

లోకేశ్‌ కంటే నేనే బెటర్ అంటున్న వైఎస్‌ జగన్‌

సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత తీవ్ర నైరాశ్యంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం తమదేనన్న ధీమాను...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్