అమెరికా పర్యటనకు టీడీపీ అధినేత చంద్రబాబు

ఏపీ సీఎం జగన్ బాటలోనే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా విదేశీ పర్యటనుకు వెళ్లారు. సతీమణి భువనేశ్వరితో సహా అమెరికా బయల్దేరి వెళ్లారు. హైదరాబాద్‌ నుంచి భార్య భువనేశ్వరితో కలిసి చంద్ర బాబు అమెరికా బయలుదేరి వెళ్లారు. ఆరు రోజుల తర్వాత తిరిగి రాష్ట్రానికి రానున్నారు. దాదాపుగా రెండు నెలలకు పైగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ జరిగింది. ప్రచారాలతో అగ్రనేతలంతా బిజీ బిజీగా గడిపారు. క్షణం తీరికలేకుండా ప్రజల్లోకి వెళ్లారు.

ఏపీలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి అన్ని పార్టీల నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిం చారు. క్షణం తీరిక లేకుండా ప్రజల్లో ఉంటూ ఓటర్లను ప్రస్ననం చేసుకునేందుకు ప్రయత్నిం చారు. ప్రజా గళం పేరిట చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ నెల 13న సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ప్రస్తుతం పోలింగ్ ముగియటంతో ప్రధాన పార్టీల రాజకీయ నేతలు రిలాక్స్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ అధినేత, సీఎం జగన్ లండన్ పర్యటనకు వెళ్లారు. తాజాగా చంద్రబాబు కూడా విదేశీ పర్యటకు వెళ్లారు. పోలింగ్ ముగియడంతో వారు ఇప్పుడు కాస్త సేద తీరేందుకు సమయం దొరికింది.

Latest Articles

రణ్ వీర్ సింగ్ పై కుట్ర జరిగిందా..?

బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ పై బ్యాన్ అనేది సంచలనం అయ్యింది. దీని పై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా కామెంట్ చేయడం.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్