20.7 C
Hyderabad
Tuesday, March 18, 2025
spot_img

భాషా వివాదాన్ని కొట్టి పారేసిన తమిళ నటుడు విజయ్

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తమిళనాడు త్రిభాషా సూత్రం పాటించాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిబంధన పెట్టింది. దీంతో తమిళనాడులో చాలా కాలం తరువాత భాషా వివాదం నెలకొంది. త్రిభాషా సూత్రం నిబంధన నేపథ్యంలో తమిళనాడులో ట్విట్టర్ వేదికగా హ్యాష్ ట్యాగ్ వార్ ప్రారంభమైంది. డీఎంకే వారు….గెట్ అవుట్ మోడీ …అంటే దానికి కౌంటర్ గా …గెట్ అవుట్ స్టాలిన్ అన్నారు బీజేపీ నాయకులు.

ఒకవైపు డీఎంకే, బీజేపీ …హ్యాష్ ట్యాగ్ వార్ లో తలమునకలై ఉంటే, తాజాగా గెట్ అవుట్ సిగ్నేచర్ ప్రచారాన్ని ప్రారంభించారు సినీ నటుడు, తమిళ వెట్రిగ కళగం అధినేత విజయ్. భాషా వివాదం నెలకొన్న నేపథ్యంలో డీఎంకే, బీజేపీ రెండూ హ్యాష్ ట్యాగ్ వార్ లో మునిగిపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. అంతేకాదు రెండు పార్టీల హ్యాష్ ట్యాగ్ వార్‌ను చిన్న పిల్లల తగాదా గా విజయ్ అభివర్ణించారు. ఈ సందర్భంగా డీఎంకే, బీజేపీ లు వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పు పట్టారు. ఈ సందర్భంగా తమిళ భాషను అలాగే తమిళ సంస్కృతిని దెబ్బతీయాలని చూస్తే సహించేది లేదన్నారు విజయ్. తమిళనాడులో బలవంతంగా హిందీని ప్రవేశపెట్టడాన్ని సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీయడమేనన్నారు ఆయన.

చెన్నైలో తమిళ వెట్రిగ కళగం …టీవీకే తొలి ఆవిర్బావ దినోత్సవాల్లో విజయ్ మాట్లాడారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ డీఎంకే, బీజేపీలపై విజయ్ ఘాటు విమర్శలు చేశారు. తమిళనాడు లో ప్రస్తుతం అనేక సమస్యలు ఉన్నాయన్నారు ఆయన. అయితే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అటు డీఎంకే ఇటు బీజేపీ గాలికొదిలేశాయని విజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే త్రిభాషా సూత్రం అమలు చేయాలని తమిళనాడుకు కేంద్ర ప్రభుత్వం నిబంధన విధించడాన్ని విజయ్ వ్యతిరేకించారు. ప్రస్తుతం అమలులో ఉన్న ద్విభాషా విధానాన్ని అటకెక్కించడం సరైన నిర్ణయం కాదన్నారు ఆయన.

తాజాగా మరోసారి తమిళనాడులో భాషా వివాదం నెలకొంది. త్రిభాషా సూత్రం కింద హిందీని అంగీకరించడం అంటే, తమిళ భాషకు తిలోదికాలు ఇవ్వడమే అన్నారు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్. హిందీని బలవంతంగా రుద్దడానికి కేంద్ర ప్రభుత్వం చేసే ఎటువంటి ప్రయత్నాన్ని అయినా తాము అడ్డుకుంటమన్నారు ఉదయనిధి స్టాలిన్. అంతేకాదు త్రిభాషా సూత్రాన్ని అమలు చేస్తేనే సమగ్ర శిక్షా మిషన్ నిధులు ఇస్తామనీ, లేదంటే…ఇచ్చేది లేదని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ హెచ్చరించడాన్ని డీఎంకే ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.కేంద్ర ప్రభుత్వం నుంచి న్యాయబద్దంగా తమకు రావాల్సిన వాటాల గురించి అడిగితే, అందుకు హిందీ భాషతో ముడిపెడుతున్నారని ఉదయనిధి స్టాలిన్ మండిపడ్డారు. కేంద్రం నుంచి రావాల్సిన వాటాకు, త్రిభాషా సూత్రానికి సంబంధం ఏమిటని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సూటిగా ప్రశ్నించారు.

కాగా రాజకీయ విభేదాలకు అతీతంగా జాతీయ విద్యా విధానం అమలు చేయాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తాజాగా ఓ లేఖ రాశారు. త్రిభాషా సూత్రానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీకి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ లేఖ రాసిన నేపథ్యంలో ధర్మేంద్ర ప్రదాన్ స్పందించారు. కాగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ లేఖకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. తమిళ భాషకు, ప్రజలకు నష్టం కలిగించే ఎటువంటి చర్యలను తమ ప్రభుత్వం అనుమతించేది లేదని తెగేసి చెప్పారు ఎంకే స్టాలిన్. సమగ్ర శిక్ష అభియాన్ కింద ఇచ్చే నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా 1965 లో తమిళనాట ఉవ్వెత్తున ఎగసిన హిందీ వ్యతరేక ఉద్యమాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ..తేనె తుట్టెపై రాళ్లు వేయరాదని ఎంకే స్టాలిన్ హెచ్చరించారు.

భాషా వివాదం నేపథ్యంలో బీజేపీకి చెందిన నాయకుడు, సినీ నటి రంజనా నచ్చియార్ తాజాగా ఆ పార్టీకి రాజీనామా చేశారు. విజయ్ నాయకత్వంలోని టీవీకే లోకి ఎంట్రీ ఇచ్చారు. తమిళుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా త్రిభాషా సూత్రంపై కేంద్ర ప్రభుత్వం పట్టుబడుతోందన్నారు. అంతేకాదు తమిళనాడు ప్రయోజనలను కూడా కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో బీజేపీ కి గుడ్ బై కొట్టినట్లు
రంజనా నచ్చియార్ పేర్కొన్నారు.

తమిళనాడులో కిందటేడాది తమిళిగ వెట్రి కళగం పేరుతో ప్రముఖ తమిళ సినీ నటుడు విజయ్ దళపతి రాజకీయ పార్టీ పెట్టారు. తమిళిగ అంటే తమిళనాడు అని అర్థం. వెట్రి అంటే విజయమని అర్థం. అలాగే కళగం అంటే రాజకీయపార్టీ అని అర్థం వస్తుంది. టోటల్‌గా తమిళిగ వెట్రి కళగం అంటే తమిళనాడు విజయం పార్టీ అనే అర్థం వస్తుంది. తమిళనాడులో కొనసాగుతున్న అవినీతి పాలనపై పోరాటం చేయడానికే రాజకీయ పార్టీ పెడుతున్నట్లు విజయ్ దళపతి పేర్కొన్నారు. అయితే 2026లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనే తొలిసారి తమిళిగ వెట్రి కళగం పోటీ చేస్తుందని తెగేసి చెప్పారు.

వాస్తవానికి తమిళనాడులో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికలలో విజయ్ పార్టీ టీవీకే కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. అయితే ఇప్పటివరకు విజయ్ పార్టీ, ఏ రాజకీయ పక్షంతో పొత్తు పెట్టుకుంటుంది అనే విషయం వెల్లడి కాలేదు. అయితే టీవీకే తొలి వార్షికోత్సవ వేడుకలకు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ హాజరయ్యారు. దీంతో టీవీకేలో ప్రశాంత్ కిశోర్ కీలక పాత్ర పోషిస్తారన్న అభిప్రాయం ప్రజల్లో నెలకొంది.

Latest Articles

‘కాలమేగా కరిగింది’ ట్రైలర్ చూశారా?

వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "కాలమేగా కరిగింది". ఈ సినిమాను శింగర క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మరే శివశంకర్ నిర్మిస్తున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్