- సోషల్ మీడియాలో సంచలనం రేకెత్తించిన విరాట్ కోహ్లి కామెంట్స్

సెలబ్రిటీలు చిన్న కామెంట్ చేసినా కొన్ని సార్లు వైరల్ గా మారుతుంటాయి. ముఖ్యంగా సినిమా, స్పోర్ట్స్ సెలబ్రిటీల కామెంట్స్ … ఇంటర్నెట్ ప్రపంచంలో హాట్‌టాపిక్‌గా నిలుస్తుంటాయి. తాజాగా భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో.. రెండో రోజు ఆట ముగించే సమయంలో ఆటగాళ్ల మీద ఒత్తిడి పెరిగింది. వెలుతురు మందగిస్తుండటంతో త్వరగా బౌలింగ్ చేసేందుకు భారత ఆటగాళ్లు ఉరకలు వేశారు. ఆ సమయంలో బంగ్లాదేశ్ ఓపెనర్ షాంట్ కాసేపు గేమ్‌ను ఆపేశాడు. షూ సరిచేసుకొంటూ టైంపాస్ చేశారు. దీంతో విసుగు చెందిన విరాట్ కోహ్లీ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పనిలో పనిగా దుస్తులు విప్పేయ్.. అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అయినప్పటికీ జరగాల్సిన డామేజీ జరిగిపోయింది. ఆటను తొందరగా ముగించేయాలని అంపైర్స్ నిర్ణయించటంతో గేమ్ నిలిచిపోయింది.