నవంబర్ 22న సన్నీ లియోన్ ‘మందిర’

సన్నీ లియోన్ తెలుగు ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుంది. ఇది వరకు కామెడీ, హారర్ ఇలా అన్ని జానర్లతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. మరోసారి సన్నీ లియోన్ తెలుగు ఆడియెన్స్‌ను భయపెట్టేందుకు ‘మందిర’ అంటూ రాబోతోన్నారు. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో ‘మందిర’ చిత్రాన్ని కొమ్మలపాటి శ్రీధర్ సమర్పణలో సాయి సుధాకర్ కొమ్మలపాటి నిర్మించారు. ఈ మూవీకి ఆర్ యువన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే మందిర సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, ట్రైలర్, పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. నవంబర్ 22న మందిర చిత్రం థియేటర్లోకి రాబోతోంది. ఇకపై మందిర టీం ప్రమోషన్స్‌తో సినిమా మీద మరింత హైప్ పెంచేందుకు సిద్దం అవుతోంది. ఈ చిత్రానికి జావెద్ రియాజ్ సంగీతం అందించారు. దీపక్ డి. మీనన్ కెమెరామెన్‌గా పని చేశారు.

నటీనటులు : సన్నీ లియోన్, యోగిబాబు తదితరులు

సాంకేతిక బృందం
బ్యానర్ : విజన్ మూవీ మేకర్స్
సమర్పణ : కొమ్మలపాటి శ్రీధర్
నిర్మాత : సాయి సుధాకర్ కొమ్మలపాటి
దర్శకుడు : ఆర్ యువన్
డైలాగ్స్ : కే రవింద్ర కళ్యాణ్, శ్రీ సాయి
మ్యూజిక్ : జావెద్ రియాజ్
కెమెరామెన్ : దీపక్ డి. మీనన్
పీఆర్వో : సాయి సతీష్

Latest Articles

సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ మసూద్ చాందీ దారుణ హత్య

హైదరాబాద్‌లో ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ మసూద్ చాందీ దారుణ హత్యకు గురయ్యాడు. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. దుండగులు మసూద్ చాందీపై దాడి చేసి హత్య చేసినట్లు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్