తమ సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసులు వందకు పైగా కేసులు నమోదు చేశారని వైసీపీ.. రాష్ట్రపతి, గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలో వాక్‌స్వేచ్ఛ లేకుండా పోయిందని, ఇది తీవ్ర ఆందోళన కలిగించే అంశమని పేర్కొంది. కస్టడీలో కార్యకర్తలు ప్రాథమిక హక్కులను కోల్పోతున్నారని తెలిపింది. అక్రమ కేసులు పెడుతున్నారని, ఈ విషయంలో రాష్ట్రపతి, గవర్నర్ జోక్యం చేసుకోవాలని ట్వీట్ చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో వాక్‌స్వేచ్ఛను అణచివేయడం తీవ్ర ఆందోళన కలిగించే అంశమని… సోషల్ మీడియా కార్యకర్తలపై ఏపీ పోలీసులు 100కు పైగా కేసులు నమోదు చేశారని తెలిపింది.. న్యాయాన్ని కాపాడానికి, భావప్రకటనా స్వేచ్ఛను రక్షించడానికి జోక్యం చేసుకోవాలని అభ్యర్థిస్తున్నామని వైసీపీ ట్వీట్ చేసింది.