చివరి క్షణంలో చిన్న సాంకేతిక సమస్య తలెత్తడంతో సునీత విలియమ్స్ అంతరిక్ష ప్రయాణం వాయిదా పడింది. నాసా అంతరిక్ష ప్రయోగంలో భాగంగా మూడో సారి భారతీయ అమెరికన్ సునిత విలియమ్స్ వెళ్లాల్సి ఉంది. నాసా బోయింగ్ స్టార్ లైనర్ ప్రయోగానికి ముందు సాంకేతిక సమస్య తలెత్తడంతో యాత్ర వాయిదా వేశారు. మళ్లీ ఎప్పుడు ప్రయోగం నిర్వహిస్తారో తేదీని నాసా ప్రకటించలేదు. మంగళవారం తెల్లవారుఝామున ఫ్లోరిడా లోని కేప్ కెనవెరాల్ లోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి బోయింగ్ స్టార్ లైనర్ .. వ్యోమనౌక అంతరిక్షంలోకి దూసుకువెళ్లాల్సి ఉంది. అట్లాస్ వి రాకెట్ ప్రయోగానికి 90 నిమిషాల ముందు సాంకేతిక సమస్య గుర్తించి ప్రయోగాన్ని నిలిపివేశారు. ఆక్సిజన్ రిలీఫ్ వాల్వ్పై నామమాత్రపు కండిషన్ కారణంగా ప్రయోగాన్ని వాయిదా వేసినట్లు నాసా తెలిపింది. నాసా మొదటి ప్రాధాన్యత భద్రత అనీ తాము సిద్ధంగా ఉన్నప్పుడు ఈ ప్రయోగం జరుగుతుందని నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ తెలిపారు.
సునీత విలియమ్స్ అంతరిక్షయాత్ర వాయిదా
0
189
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


