స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్ 141 పాయింట్ల లాభంతో 61,871 దగ్గర కొనసాగుతుంది. నిఫ్టీ 52 పాయింట్లు లాభపడి 18,256 దగ్గర ఉంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.79గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ, టైటన్, ఇన్ఫోసిస్, విప్రో, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, మారుతీ షేర్లు లాభాల్లో ఉండగా… ఏషియన్ పెయింట్స్, ఎంఅండ్‌ఎం, కొటాక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, నెస్లే ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.