హైదరాబాద్: దసరా, బతుకమ్మ పండుగ సంబరాల్లో తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ స్టార్ మా సీరియల్ నటులు… తమ అభిమాన ప్రేక్షకులతో కలిసి నగరంలోని వివిధ ప్రాతాలలో దుర్గా పూజా మండపాల వద్ద సందడి చేశారు. స్టార్ మా సీరియల్స్ “పలుకే బంగారమాయెనా” , “నాగ పంచమి” ఆర్టిస్టులు నగరంలోని వివిధ ప్రాంతాల్లో తమ అభిమానులతో సంతోషంగా గడపారు. ప్రకాశవంతంగా వెలిగిపోతున్న దుర్గా పూజా మండపాల వద్ద బతుకమ్మ ఆడుతూ, పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ, సెల్ఫీలు తీసుకుంటూ, బహుమతులను అందిస్తూ, సమిష్టి స్ఫూర్తిని చాటుతూ ఆనందోత్సాహాలతో గడిపారు. తమ వీక్షకులతో దృఢమైన బంధాన్ని పెంపొందించుకోవడానికి, ప్రతి పండుగను సంతోషకరమైన అనుభూతిగా మార్చడానికి స్టార్ మా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దసరా, బతుకమ్మ వేడుకల సందర్భంగా తమ కళాకారులను ప్రేక్షకులకు మరింత చేరువ చేసేందుకు ఛానెల్ ప్రయత్నం చేస్తోందని నిర్వాహకులు తెలిపారు.
దుర్గా మండపాల వద్ద బుల్లితెర తారల సందడి
0
306
Latest Articles
క్షమాపణ చెబుతారని అనుకన్నా.. కానీ డైవర్షన్ చేస్తున్నారు- స్పీకర్
అసెంబ్లీ దగ్గర నిన్న జరిగిన ఘటనపై సభలో క్షమాపణ చెబుతారని అనుకున్నానని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. చిట్‌చాట్‌లో మాట్లాడిన ఆయన.. వాస్తవానికి మైక్ ఇవ్వద్దు.. తాను స్పీకర్‌గా నాలుగు వైపుల...
- Advertisement -
- Advertisement -


