సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మద్యానికి బానిసై వావి వరుసలు మరిచిన భర్తను గొడ్డలితో నరికి కడతేర్చింది భార్య. కొన్నాళ్లుగా కూతురిని వేధిస్తున్న తండ్రిని భార్య హతమార్చిన ఘటన చౌటకుర్ మండలం సుల్తాన్ పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన మనయ్య తాగుడు వ్యసనానికి బానిసయ్యాడు. సంవత్సరం నుంచి భర్త చనిపోయి తన ఇంట్లో ఉంటున్న కూతురి తో మానయ్య అసభ్యంగా ప్రవర్తించసాగాడు. బుధవారం రాత్రి మానయ్య తాగి వచ్చి గడ్డపారతో తలుపు లు ధ్వంసం చేశాడు. కూతురు సుకన్యను ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని బెదిరిస్తూ దాడికి పాల్ప డ్డాడు. దీంతో భార్య ఇందిరా గొడ్డలితో మెడమై నరకగా మానయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.


