మహేశ్ హత్య కేసులో బయటపడ్డ సంచలన విషయాలు

హైదరాబాద్ శివారులో దారుణ హత్యకు గురైన ఘట్‌కేసర్ మాజీ ఎంపీటీసీ మహేశ్ హత్య కేసులో సంచలన విష యాలు వెలుగులోకి వచ్చాయి. జూన్ 17న మహేశ్ బయటకువెళ్లి తిరిగిరాకపోవంతో ఆయన సోదరుడు విఠల్ పోలీ సులకు ఫిర్యాదు చేశారు. మహేశ్ మృతదేహం NFC నగర్ డంపింగ్ యార్డులో లభ్యమైంది. మృతుడి ఫోన్‌తోనే ఆయన బంధువులతో నిందితులు వాట్సాప్ చాటింగ్ చేశారు. మహేశ్ ఎక్కడికీ వెళ్లలేదని నమ్మించే ప్రయత్నం చేశారు నిందితులు. మహేశ్ బతికే ఉన్నట్లు, హైదరాబాద్ లో పని ఉండి వచ్చినట్లు నమ్మించారు. తాను సొంత ప్రాంతానికి రావడానికి మరో మూడు రోజులు పడుతుందని మృతిడి ఫోన్ తో నిందితులు వాట్సాప్ చాటింగ్ చేశారు.చివరకు మహేశ్ మృత దేహం లభ్యమైంది. స్థానిక కౌన్సిలర్ మల్లేశ్‌పై మహేశ్ బంధువులు, తల్లి ఆరోపణలు చేశారు. నింది తులందరినీ కఠినంగా శిక్షించాలని ఆందోళన చేపట్టారు. మృతుడు, నిందితుల నివాసాల వద్ద పోలీసు లు పికెటింగ్ ఏర్పాటు చేశారు. మహేశ్ హత్యపై అనుమానాలు ఉన్నాయని, సరైన విచారణ జరపాలని బంధువులు, కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేశారు.

Latest Articles

హీరో విజయ్‌ దేవరకొండకు TCA లీగల్ నోటీసులు

హీరో విజయ్‌ దేవరకొండకు తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ లీగల్ నోటీసులు పంపింది. HCA టీజీ20 లీగ్‌ను ప్రమోట్‌ చేయడంపై నోటీసులు ఇచ్చింది.  HCA టీజీ20 లీగ్‌కు బీసీసీఐ అనుమతి లేదని TCA పేర్కొంది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్