తనను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతోనే ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అక్రమంగా హౌస్ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు.. చిల్లర రాజకీయాల కోసమే ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తోంది బీఆర్ఎస్ నాయకులు కాదని.. సీఎం రేవంత్‌రెడ్డేనని ఫైర్ అయ్యారు. తనపై దాడి చేసేందుకు వచ్చిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు ఎందుకు ఆపలేకపోయారో సమాధానం చెప్పాలన్నారు. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీనే తనను తీవ్రంగా దూషించారని.. తాను చేసిన తప్పేమిటో చెప్పాలని ప్రశ్నించారు. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని గాంధీయే చెబుతున్నారని.. అయితే ఆయన గులాబీ కండువా కప్పుకోవాలని కౌశిక్‌రెడ్డి మరోసారి డిమాండ్ చేశారు.