స్వతంత్ర వెబ్ డెస్క్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు అలర్ఠ్…ఇవాళ స్కూళ్లు, కాలేజీలు బంద్ కానున్నాయి. విశాఖ ఉక్కు పరిరక్షణ, కడప ఉక్కు ఫ్యాక్టరీ సాధనకు మద్దతుగా నవంబర్ 8న అంటే ఇవాళ విద్యాసంస్థల బంద్ చేపట్టనున్నట్లు PDSU, AISF, AIYF ప్రకటించాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీ కరణకు వ్యతిరేకంగా చేపట్టిన పోరాటానికి ఇవాళ్టి తో వెయ్యి రోజులు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ బంద్ చేపట్టనున్నారు. అన్ని యువజన, విద్యార్థి సంఘాలు ప్రత్యక్షంగా ఆందోళనలో పాల్గొనాలని ఆయా సంఘాలు పిలుపునిచ్చాయి. ఇది ఇలా ఉండగా.. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేసేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఎక్కడ తగ్గేది లేదు అన్నట్లుగా… కేంద్రం దీనిపై ముందుకు అడుగులు వేస్తోంది. కేంద్రం నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి పక్షాలు, అధికార వైసిపి.. అలాగే విశాఖ ఉక్కు కార్మికులు దీనిపై పోరాటం చేస్తూనే ఉన్నారు.
ఇవాళ పాఠశాలలు, కాలేజీలు బంద్..!
0
576
Previous article
Next article
Latest Articles
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్ర పూజల వ్యాఖ్యల దుమారం
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్ర పూజల వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. హరీశ్ రావు క్షుద్రపూజలు చేస్తున్నారని మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపిస్తే... కాదు రేవంత్ రెడ్డే క్షుద్రపూజలు చేస్తున్నారని దాసోజు శ్రవణ్ కౌంటరిచ్చారు. వర్షాలు పడకూడదని,...
- Advertisement -
- Advertisement -


