Jobs: సింగరేణిలో ఉద్యోగాలు.. ధరఖాస్తుకు ఆఖరితేదీ ఇదే.. షరతులు వర్తిస్తాయి..

Jobs: కొలువుల భర్తీకి ప్రకటన కోసం చూసేవారి సంఖ్య అధికంగానే ఉంటుంది. యువత తమ చదువు పూర్తిచేసుకున్న తర్వాత.. ఉద్యోగాల కోసం కోచింగ్‌ తీసుకుంటూ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అటువంటి వారికి గుడ్‌ న్యూస్‌.. సింగరేణిలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 61 ఎగ్జిక్యూటివ్, 199 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అంటే మొత్తం 260 ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ చేశారు. అయితే ఇంటర్నర్ రిక్రూట్‌మెంట్ ద్వారా మాత్రమే ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అంటే సంస్థలో ఇప్పటికే పనిచేస్తున్న అభ్యర్థులతోనే ఈ ఖాళీలను భర్తీ చేస్తారు. ఈ పోస్టుల భర్తీకి మార్చి 3వ తేదీ నుంచి 13లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు హార్డ్‌కాపీలకు, అవసరమైన అన్ని డాక్యుమెంట్లు జతచేసి వారివారి విభాగాల అధిపతులకు మార్చి 16లోగా సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసే అభ్యర్థులు మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఈఈఈ పూర్తి చేసి.. 3 ఏళ్ల అనుభవం ఉంటే అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మిగిలిన పోస్టులకు పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టులో బీటెక్ పూర్తి చేసి ఉండాలి. వీటికి ఎలాంటి వయోపరిమితి వర్తించదు. రాతపరీక్ష, అసెస్‌మెంట్ రిపోర్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు. ఈ క్రమంలో రాతపరీక్షకు 85 మార్కులు, అసెస్‌మెంట్ రిపోర్టుకు 15 మార్కులు ఉంటుంది. వీటి ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

మరిన్ని వార్తల కోసం చూడండి..

Latest Articles

breaking: కార్మికులపై పడ్డ ద్రవ ఉక్కు…8 మంది కార్మికులు మృతి

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 8 మంది కార్మికులు చనిపోయారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్టీల్​ప్లాంట్ మెటల్ లిక్విడ్ లాడిల్ పేలడంతో ప్రమాదం సంభవించింది. సీసీడీ విభాగంలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్