28.8 C
Hyderabad
Monday, June 2, 2025
spot_img

పవర్‌ఫుల్‌ పోస్టర్‌తో ఉత్కంఠ రేకెత్తిస్తున్న ‘ష‌ణుఖ్మ‌’

మంచి కథాంశంతో.. ఆసక్తిని కలిగించే నేపథ్యంతో రూపొందే డివోషనల్‌ చిత్రాలకు అన్ని భాషల్లో మంచి ఆదరణ వుంటుంది. ఆ నమ్మకంతోనే రూపొందుతున్న పాన్‌ ఇండియా డివోష‌న‌ల్ థ్రిల్ల‌ర్ చిత్రం ‘ష‌ణ్ముఖ’. ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆది సాయికుమార్ క‌థానాయ‌కుడు. అవికాగోర్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి ష‌ణ్ముగం సాప్ప‌ని ద‌ర్శ‌కుడు. శాస‌న‌స‌భ అనే పాన్ ఇండియా చిత్రంతో అంద‌రికి సుప‌రిచిత‌మైన సంస్థ సాప్‌బ్రో ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ త‌మ ద్వితీయ చిత్రంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సాప్ప‌ని బ్ర‌దర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో తుల‌సీరామ్ సాప్ప‌ని, ష‌ణ్ముగం సాప్ప‌ని, ర‌మేష్ యాద‌వ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మణానంతర పనులను జరుపుకుంటోంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ఈ పోస్టర్‌ అందరిలోనూ ఆసక్తిని రేపుతుంది. ఈ చిత్రంలో పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా ఆది నటిస్తున్న విషయం తెలిసిందే. పోలీస్‌డ్రెస్‌తో ఆది పవర్‌ఫుల్‌గా కనిపిస్తుండగా, ఆయన వెనకాల షణ్ముఖ సుబ్రమణ్యస్వామి కనిపించడం, పోస్టర్‌ చూసిన అందరిలోనూ పాజిటివ్‌ వైబ్‌ కనిపిస్తుంది.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు మ‌ట్లాడుతూ ‘‘ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని ఓ అద్భుత‌మైన పాయింట్‌తో రూపొందుతున్న డివోష‌న‌ల్ థ్రిల్ల‌ర్ ఇది. విజువ‌ల్ వండ‌ర్‌లా, అద్బుత‌మైన గ్రాఫిక్స్‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాం. డివోషనల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రతి పాత్ర హైలైట్‌గా వుంటుంది. అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం. కేజీఎఫ్‌, స‌లార్ చిత్రాల‌కు త‌న సంగీతంతో ప్రాణం పోసిన ర‌వి బ‌సూర్ ఈ చిత్రానికి స్ట‌నింగ్ మ్యూజిక్‌ను అందిస్తున్నారు. ప్ర‌స్తుతం అత్యున్న‌త సాంకేతిక నిపుణుల‌తో నిర్మాణనంత‌ర ప‌నులు మొద‌లుకానున్నాయి. విజువ‌ల్ ఎఫెక్ట్స్‌, గ్రాఫిక్స్ విష‌యంలో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుని, ఓ వండ‌ర్‌ఫుల్ మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుక‌రావ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాం. త‌ప్ప‌కుండా ఈ చిత్రం ఆది కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోతుంది’’ అని అన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్