24.7 C
Hyderabad
Saturday, July 13, 2024
spot_img

‘అరి’లో చతుర్, వితుర్‌గా శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర

ఆర్వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, డా.తిమ్మప్ప నాయుడు పురిమెట్ల.Ph.D, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘అరి’. ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనేది ఉపశీర్షిక. వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. “పేపర్ బాయ్” చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన జయశంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. త్వరలోనే ‘అరి’ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఈ రోజు ‘అరి’ సినిమా నుంచి చతుర్, వితుర్ గా శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర క్యారెక్టర్స్ ఫస్ట్ లుక్ ను రివీల్ చేశారు. వీరిద్దరు పండితుల వేషధారణలో సంభాషిస్తున్న స్టిల్ ను పోస్టర్ గా విడుదల చేశారు. చతుర్, వితుర్ అనే పేర్లలోనే నవ్వు ధ్వనిస్తోంది. శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర ఈ పాత్రల్లో వినోదాన్ని అందించబోతున్నారు. ‘అరి’ మూవీలో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ భాగస్వామి కానుంది. ‘అరి’ రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా మూవీ టీమ్ అనౌన్స్ చేయనుంది.

నటీనటులు – వినోద్ వర్మ , సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర, శుభలేక సుధాకర్, సురభి ప్రభావతి, అక్షయా శెట్టి, రిధిమా పండిట్, పి.అనిల్ కుమార్, నవీనా రెడ్డి, తమిళ బిగ్ బాస్ ఫేమ్ పావని రెడ్డి, జెమినీ సురేష్, ఐ డ్రీమ్ అంజలి, మనిక చిక్కాల, సుమన్, ఆమని, ప్రవళ్లిక చుక్కల, సురభి విజయ్, బ్యాంకు శ్రీనివాస్, సమీర్, మాణిక్ రెడ్డి, రాజ్ తిరందాస్, గాయత్రి భార్గవి, మీనా కుమారి, లావణ్య రెడ్డి, ఇంటూరి వాసు, జబర్దస్త్ సద్దాం, నీలా ప్రియ, యోగి ఖత్రి తదితరులు

టెక్నికల్ టీమ్
మ్యూజిక్ : అనుప్ రూబెన్స్
ఎడిటర్ : జి. అవినాష్
లిరిక్స్ : కాసర్ల శ్యాం, వనమాలి, కళ్యాణ్ చక్రవర్తి,
కొరియోగ్రఫీ – భాను, జీతు
ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవ్ నాయర్
స్టైలిస్ట్ : శ్రీజ రెడ్డి చిట్టిపోలు, సిరి చందన
సినిమాటోగ్రఫీ : కృష్ణ ప్రసాద్, శివశంకర వరప్రసాద్
లైన్ ప్రొడ్యూసర్ : శివకాంత్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : వినయ్
పి. ఆర్. ఓ – జి యస్ కే మీడియా
సమర్పణ : ఆర్ వీ రెడ్డి
నిర్మాతలు : శ్రీనివాస్ రామిరెడ్డి, డా.తిమ్మప్ప నాయుడు పురిమెట్ల. Ph.D , శేషు మారం రెడ్డి
రచన –దర్శకత్వం : జయశంకర్

Latest Articles

కూటమి సర్కార్ పై నిప్పులు చెరిగిన షర్మిల

కూటమి సర్కార్ పై కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు వందల కోట్లు ఇచ్చి.. అభివృద్ధి చేసింది కేవలం దివంగత వైఎస్ఆర్ మాత్రమేనని.. ఆ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్