బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్(Salman Khan)ను చంపేస్తామని మరోసారి దుండగులు బెదిరించారు. సోమవారం రాత్రి ముంబయి పోలీస్ కంట్రోల్ రూంకు రాకీ భాయ్ అనే వ్యక్తి ఫోన్ చేసి ఈనెల 30వ తేదీ లోపు సల్మాన్ ను చంపేస్తామని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఫోన్ ఎవరు చేశారు? ఎక్కడు నుంచి ఫోన్ వచ్చిందనే విషయాలపై ఆరా తీస్తున్నారు. గతంలో కూడా ఇలాగే గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ కు బెదిరింలు వచ్చాయి. వరుస బెదిరింపుల నేపథ్యంలో పోలీసులు సల్మాన్ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. కాగా సల్లూ భాయ్ తాజాగా నటించిన ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’(Kisi Ka Bhai Kisi Ki Jaan) ట్రైలర్ ఇటీవలే విడుదలైంది.
ఏప్రిల్ 30లోపు సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని వార్నింగ్
0
314
Latest Articles
ఫౌజీ వస్తున్నాడు.. మరి.. బాలయ్య..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ, క్రేజీ మూవీ ఫౌజీ. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఇన్ని రోజులు సస్పెన్స్ గా ఉండేది. ఇప్పుడు డిసెంబర్...
- Advertisement -
- Advertisement -


