27.2 C
Hyderabad
Saturday, March 21, 2026
spot_img

రిషి సునాక్‌కు వంద పౌండ్ల జరిమానా..! క్షమాపణలు చెప్పిన బ్రిటన్‌ ప్రధాని

  • కారులో ప్రయాణిస్తూ సీటు బెల్ట్ పెట్టుకోనందుకు ఫైన్‌ విధించిన పోలీసులు

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కు అక్కడి ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. కారులో ప్రయాణిస్తూ సీటు బెల్ట్ పెట్టుకోనందుకు రిషి సునాక్ కు వందపౌండ్ల జరిమానా వేశారు. ఒక చిన్న వీడియో చిత్రీకరణ కోసం రిషి సునాక్ కాసేపు సీటు బెల్ట్ తీసేశారు. ఇదే వివాదానికి కారణమైంది. ఈ సంఘటన బ్రిటన్‌ లో దుమారం రేపింది. దీంతో సీటు బెల్ట్ పెట్టుకోనందుకు రిషి సునాక్ క్షమాపణలు చెప్పారు. దేశవ్యాప్తంగా వంద ప్రాజెక్టులకు నిధులు సమకూర్చే వీడియో కోసం కొన్ని నిమిషాల పాటు సీటు బెల్ట్ పక్కన పెట్టినట్లు రిషి సునాక్‌ వివరణ ఇచ్చారు. అయితే రిషి సునాక్ వివరణపై లేబర్ పార్టీ నేతలు విమర్శలు చేశారు. సీటు బెల్ట్ కు ఆర్థికవ్యవస్థకు రిషి సునాక్ ముడిపెట్టారని లేబర్ పార్టీ నాయకులు వ్యాఖ్యానించారు.

బ్రిటన్ లో ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందే. కారు ప్రయాణీకులు సీటు బెల్ట్‌ పెట్టుకోకపోతే వందపౌండ్ల జరిమానా విధిస్తారు. అదే సదరు కేసు కోర్టు వరకు వెళితే జరిమానా మరింతగా పెరిగే అవకాశాలున్నాయి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్