- కారులో ప్రయాణిస్తూ సీటు బెల్ట్ పెట్టుకోనందుకు ఫైన్ విధించిన పోలీసులు
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కు అక్కడి ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. కారులో ప్రయాణిస్తూ సీటు బెల్ట్ పెట్టుకోనందుకు రిషి సునాక్ కు వందపౌండ్ల జరిమానా వేశారు. ఒక చిన్న వీడియో చిత్రీకరణ కోసం రిషి సునాక్ కాసేపు సీటు బెల్ట్ తీసేశారు. ఇదే వివాదానికి కారణమైంది. ఈ సంఘటన బ్రిటన్ లో దుమారం రేపింది. దీంతో సీటు బెల్ట్ పెట్టుకోనందుకు రిషి సునాక్ క్షమాపణలు చెప్పారు. దేశవ్యాప్తంగా వంద ప్రాజెక్టులకు నిధులు సమకూర్చే వీడియో కోసం కొన్ని నిమిషాల పాటు సీటు బెల్ట్ పక్కన పెట్టినట్లు రిషి సునాక్ వివరణ ఇచ్చారు. అయితే రిషి సునాక్ వివరణపై లేబర్ పార్టీ నేతలు విమర్శలు చేశారు. సీటు బెల్ట్ కు ఆర్థికవ్యవస్థకు రిషి సునాక్ ముడిపెట్టారని లేబర్ పార్టీ నాయకులు వ్యాఖ్యానించారు.
బ్రిటన్ లో ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందే. కారు ప్రయాణీకులు సీటు బెల్ట్ పెట్టుకోకపోతే వందపౌండ్ల జరిమానా విధిస్తారు. అదే సదరు కేసు కోర్టు వరకు వెళితే జరిమానా మరింతగా పెరిగే అవకాశాలున్నాయి.