బీజేపీ-బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒక్కటేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) తెలిపారు. సీఎం కేసీఆర్ కుటుంబం ఆస్తి రూ.లక్ష కోట్లకు చేరిందని.. కానీ ఆస్తులపై కేంద్రం విచారణ చేయడం లేదని ఆరోపించారు. కేసీఆర్(KCR) అవినీతిపై ఎన్ని ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోవడం లేదని.. ఆ రెండు పార్టీల మధ్య సంబంధాలు ఉన్నాయనడానికి ఇదే నిదర్శమని తెలిపారు. తెలంగాణలో 80శాతం మంది కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 80 సీట్లు బీఆర్ఎస్ కు 25 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. పాదయాత్రలో ప్రజలతో మాట్లాడిన తర్వాతే ఈ విషయం చెబుతున్నానని పేర్కొన్నారు. కొడంగల్ నుంచి పోటీ చేయాలనే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లానని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
Read Also: బీఆర్ఎస్ కు సరికొత్త నిర్వచనం చెప్పిన బండి సంజయ్
Follow us on: Youtube, Instagram, Google News