అసెంబ్లీలో కులగణన అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి మాట ఇచ్చారన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు హనుమంతరావు. ప్రధాని నరేంద్ర మోదీ బీసీ అయ్యి ఉండి పదేళ్లు బీసీలను పట్టించుకోలేదన్నారు. కులగణన చేయడం వల్ల పంచాయతీ ఎన్నికల్లో అధిక మెజారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పారు. తమ వద్దకు వచ్చే బడుగు, బలహీన వర్గాల సంఖ్యను నమోదు చేయాలని పార్టీ నేతలను కోరుతున్నానన్నారు. కర్ణాటకలో కూడా కులగణన అమలు అయ్యేలా చూస్తామన్నారు. తాను ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉండి పార్టీకి సేవ చేస్తానని హనుమంతరావు తెలిపారు.