Free Porn
xbporn
24.2 C
Hyderabad
Thursday, July 25, 2024
spot_img

2030 కల్లా అంతరిక్ష యాత్రకు రెడీ ?

మనదేశంలో అంతరిక్ష పర్యాటకానికి బోలెడంత క్రేజ్ ఉంది. భారతదేశంలో చాలామంది రోదసీ యాత్రలపై ఆసక్తి చూపుతున్నారు.ఈ నేపథ్యంలో 2030 నాటికి భారతదేశంలో తొలిసారి అంతరిక్ష పర్యాటకం ప్రారంభించాలని ఇస్రో ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నాయని ఇస్రో వర్గాలు వెల్లడించా యి. భారతదేశంలో రోదసీ యాత్రలకు మంచి భవిష్యత్ ఉందంటు న్నాయి ఇస్రో వర్గాలు. అంతేకాదు రానున్న రోజుల్లో అంతరిక్ష యానం ఒక ప్రధాన ఆదాయ వనరుగా మారుతుందన్నారు నిపుణులు.

తెలుగువాడి కీర్తి మరోసారి విశ్వవ్యాప్తమైంది. తెలుగు వ్యక్తి తోటకూర గోపీచంద్ విజయవంతంగా అంతరిక్ష యాత్రను పూర్తి చేశారు. గోపీచంద్, ఒక పర్యాటకుడిగా అంతరిక్షంలోకి అడుగుపెట్టి వచ్చారు. ఈ సందర్భంగా అంతరిక్ష పర్యాటకం హాట్‌టాపిక్‌ అయింది. అంతరిక్ష పర్యాటకం అనేది ఒక కలలాంటిది. అయితే అసలు ఈ కల సాకారమవు తుందా ? లేదా ? అనే ప్రశ్న కూడా గతంలో తెరమీదకు వచ్చింది.అయితే కాలక్రమంలో ఈ కలను సాకారం చేశాయి అంతరిక్షం తో ముడిపడ్డ అనేక కంపెనీలు. ఇది రాత్రికి రాత్రి జరిగింది కాదు. దీని వెనుక ఆయా సంస్థల రాత్రింబవళ్ల కష్టం ఉంది. అంతరిక్ష నిపుణుల స్వేదం ఉంది. వారి తెలివి అలాగే క్రియేటివిటీ ఉంది.

‘వర్జిన్‌ గెలాక్టిక్‌’ అమెరికాకు చెందిన ఓ ప్రైవేటు కంపెనీ. అదేదో సాదాసీదా కంపెనీ కాదు. రోదసీయాత్రలు చేపట్టే ఓ అపురూప కంపెనీయే ‘వర్జిన్‌ గెలాక్టిక్‌’.2004లో రిచర్డ్ బ్రాన్సన్ అనే సంపన్నుడు ‘వర్జిన్‌ గెలాక్టిక్‌ ’ పేరుతో ఒక స్పేస్ టూరిజం కంపెనీని స్థాపించాడు. 2021 జులై నెలలో ఓ రోదసీయాత్ర నిర్వహించింది ‘వర్జిన్‌ గెలాక్టిక్‌ . సంస్థ అధిపతి రిచర్డ్ బ్రాన్సన్‌తో పాటు మరో ఆరుగురు ‘వీఎస్‌ఎస్‌ యూనిటీ-22’ అనే వ్యోమనౌక ద్వారా వినువీధుల్లో విహరించారు. వినువీధుల్లో విహారం తరువాత సురక్షితంగా భూమి మీదకు తిరిగివచ్చారు. ఆన్‌లైన్ దిగ్గజ సంస్థ అమెజాన్‌ వ్యవస్థాప కుడు జెఫ్‌ బెజోస్‌కు కూడా అంతరిక్ష పర్యాటకంతో సంబంధం ఉంది. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ సైతం 2021లో తన స్వంత వ్యోమనౌకలో రోదసీ యాత్ర చేశారు.జెఫ్‌ బెజోస్‌ నెలకొల్పిన కంపెనీ ‘బ్లూ ఆరిజిన్‌’ ఈ రోదసీ యాత్ర నిర్వహించింది.

స్పేస్‌ ఎక్స్‌…ఇది అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన మరో సంస్థ. వివాదాస్పద కార్పొరేట్ దిగ్గజం ఎలన్ మస్క్‌ స్వంత సంస్థ ఇది. అంతరిక్షంపై తన ఆలోచనలకు అనుగుణంగా స్పేస్‌ ఎక్స్‌ అనే సంస్థను ఎలన్ మస్క్‌ ప్రారంభిం చాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఎలన్ మస్క్ పేరు మార్మోగింది. అంతరిక్ష పరిశోధనల్లో స్పేస్‌ ఎక్స్‌ ఒక వినూత్న ప్రాజెక్ట్‌ అంటారు నిపుణులు. ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష యాత్ర పరిధి మారుతోంది. అంతరిక్ష యాత్ర మరింత విస్తృతమవు తోంది. రోదసీ యాత్ర కాస్తా స్పేస్ అడ్వెంచర్ మోడల్‌గా అభివృద్ధి చెందుతోంది. అయితే కొన్ని కారణాలతో అందుకు అడ్డంకులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం, రాకెట్ ప్రయోగం చాలా ఖరీదైన పరీక్షగా మారింది. కొన్నేళ్లుగా రాకెట్లలో ఉపయోగిం చే ఇంధనం అలాగే వనరుల ఖర్చు పెరిగింది. రోదసీ యాత్రలు విలాసవంతంగానే కాదు, సాహసయాత్రలు గానూ ఉంటాయి. రోదసీయాత్రల్లో ప్రయాణీకుల భద్రతపై ఎక్కువ దృష్టి పెట్టాయి సదరు కంపెనీలు.

సహజంగా టూరిజం అంటే అందరికీ ఆసక్తి ఉంటుంది. అయితే అంతరిక్ష పర్యాటకం అంటే మరింత ఆసక్తి ఉంటుంది. అయితే అంతరిక్ష పర్యాటకం అందరికీ అందుబాటులో ఉండదు. కేవలం కోటీశ్వరులకు మాత్రమే ఉంటుంది. అంతరిక్ష పర్యాటకానికి సంబంధించిన ధరలను సామాన్యులు ఏమాత్రం భరించలేరు. కేవలం సంపన్నులు అదికూడా కోటీశ్వరులు మాత్రమే రోదసీ యాత్ర టికెట్లు కొంటారు. సహజంగా అంతరిక్షంలోకి రానూపోనూ ఒక్కో టికెట్ ధర కోట్ల రూపాయల్లో ఉంటుంది. ‘వర్జిన్‌ గెలాక్టిక్‌’ కంపెనీ అమ్మిన అంతరిక్ష టికెట్‌ ఒక్కోటి భారతీయ కరెన్సీలో దాదాపు రూ.1.86 కోట్లు. ‘వర్జిన్‌ గెలాక్టిక్‌’ కంపెనీ అమ్మిన రోదసీ టికెట్లను కొన్నవారిలో పలువురు హాలీవుడ్ సెలబ్రిటీలు ఉండటం విశేషం.

మనదేశంలో అంతరిక్ష పర్యాటకానికి ప్రారంభ దశలోనే బోలెడంత క్రేజ్ వచ్చింది. భారతదేశంలో చాలామంది రోదసీ యాత్రలపై ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో 2030 నాటికి భారతదేశంలో తొలిసారి స్పేస్ టూరిజం ప్రారంభించాల ని ఇస్రో యోచిస్తోంది. ఈ రోదసీ యాత్రలో ఒక్కో టికెట్ ధర దాదాపు ఆరు కోట్ల రూపాయలు ఉండే అవకాశముంది. ఈ యాత్ర చేసివచ్చిన వారు తమను తాము వ్యోమగాములుగా పిలుచుకోవచ్చు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నాయని ఇస్రో వర్గాలు వెల్లడించాయి. అంతేకాదు భారతదేశంలో రోదసీ యాత్రలకు మంచి భవిష్యత్ ఉందంటున్నారు అంతరిక్షరంగ నిపుణులు. అంతరిక్ష యాత్ర నిస్సందేహంగా లాభదాయకమే అంటున్నారు. రానున్న రోజుల్లో అంతరిక్ష యానమనేది ఒక ప్రధాన ఆదాయ వనరుగా మారుతుందన్నారు నిపుణులు. స్పేస్ టూరిజానికి వివిధ భారతీయ మంత్రిత్వ శాఖలు కొత్త పథకాలతో ముందుకు వస్తున్నాయి. కొన్నేళ్లుగా ఆర్థిక వ్యవస్థ వృద్ధికి పర్యాటకం ప్రధాన వనరుగా ఉంది. పర్యాటకం ద్వారా అత్యధిక విదేశీ మారక ద్రవ్యాన్ని పొందుతున్న భారత దేశం తాజాగా అంతరిక్ష పర్యాటకంపై దృష్టి పెట్టింది.

ప్రస్తుతం భారతదేశం ఎదురు చూస్తున్న అత్యంత ఉత్తేజకరమైన పర్యాటక రూపాలలో ఒకటి అంతరిక్ష పర్యాటకం. ఇప్పుడు, అంతరిక్షం అందరికీ చివరి సరిహద్దుగా మారింది. మనదేశ ఆర్థిక వ్యవస్థకు అంతరిక్ష పర్యాటకం ఊతం ఇస్తుందంటున్నారు నిపుణులు. అంతరిక్ష పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి భారతదేశం ముందుగా స్పష్టమైన చట్టాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో జాతీయత, వ్యోమనౌక ఫిట్‌నెస్‌ను గుర్తించడం, వైద్య ప్రమాణాలు, అంతరిక్ష సిబ్బందికి లైసెన్సింగ్, భద్రతా జాగ్రత్తలు ఇవన్నీ చాలా ముఖ్యమైనవి. రోదసీ యాత్రలను విజయవంతం చేయడానికి భారతదేశం ముందుగా వీటిపై దృష్టి పెట్టాలంటున్నారు నిపుణులు.అయితే అంతరిక్ష పర్యాటకం అనేది చిన్న విషయం కాదు. దీనికి కోట్లకు కోట్లు పెట్టుబడులు అవసరం అవుతాయి. ఈ భారీ పెట్టుబడులను కేవలం ప్రభుత్వ సంస్థలే పెట్టాలనుకోవడం అత్యాశే అవుతుంది. అంతరిక్ష పర్యాటకంలో ప్రైవేటు సంస్థల పెట్టుబడులు కూడా అవసరమవుతాయి. అయితే అంతరిక్ష పర్యాటకరంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఎన్ని ప్రైవేటు సంస్థలు ముందుకు వస్తాయనేదే ప్రశ్న. ఈ విషయంలో ప్రైవేటు సంస్థలను అంతరిక్ష పరిశోధకులు ఒప్పించగలగాలి. ప్రైవేటు సంస్థల ఇన్‌వాల్వ్‌మెంట్‌తో స్పేస్ టూరిజాన్ని ఒక రేంజ్‌కు తీసుకెళ్లాలని భావిస్తున్నారు నిపుణులు. సమర్థవంతంగా నిర్వహిస్తే అంతరిక్ష పర్యాటకం ఒక లాభదాయక పరిశ్రమ అవుతుందంటున్నారు నిపుణులు.

ప్రపంచంలో సామాజిక పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయి. ఇటీవలికాలంలో ప్రజల ఆలోచనా ధోరణి మారింది. ఏకంగా అంతరిక్షంలోకి ఓ సారి వెళ్లి రావాలన్న వేయాలన్న కుతూహలం ప్రజల్లో పెరిగింది. రానున్న రోజుల్లో ఈ కుతూహలం మరింతగా బలపడుతుందని అంతరిక్షరంగ నిపుణులు భావిస్తున్నారు. ఇప్పుడు ఉత్తర దేశయాత్ర లాగా భవిష్యత్తులో అంతరిక్ష పర్యాటకం సర్వసాధారణం అవుతుందని భావిస్తున్నారు.

Latest Articles

బీఆర్‌ఎస్‌ ఓటమి తర్వాత తొలిసారి సభకు కేసీఆర్‌

బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ఇవాళ తెలంగాణ బడ్జెట్ సమాశాలకు హాజరుకానున్నారు. బీఆర్‌ఎస్‌ ఓటమి తర్వాత తొలిసారి ప్రతిపక్ష నేతగా శాసనసభలో అడుగుపెట్టనున్న నేపథ్యంలో కేసీఆర్‌ రాకపై ఆసక్తి నెలకొంది. కేసీఆర్ ఏం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్