‘శశివదనే’ రిలీజ్ డేట్‌ను లాక్ చేసిన మేకర్స్

‘పలాస 1978’లో అద్భుతమైన నటనతో అందరి ప్రశంసలు అందుకున్నారు రక్షిత్ అట్లూరి. అలాంటి రక్షిత్ అట్లూరి ప్రస్తుతం పూర్తి ప్రేమ కథా చిత్రంతో రాబోతోన్నారు. రక్షిత్ అట్లూరి హీరోగా, కోమలి హీరోయిన్‌గా ‘శశివదనే’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రచయిత, దర్శకుడు సాయి మోహన్ ఉబ్బన చేసిన ఈ చిత్రాన్ని అహితేజ బెల్లంకొండ నిర్మించారు. ఇది AG ఫిల్మ్ కంపెనీ, SVS స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

శశి వదనే సినిమాకు సంబంధించిన ప్రతీ అప్డేట్ అందరినీ ఆకట్టుకుంది. టీజర్‌తో ఈ చిత్రం ఎలా ఉంటుంది.. మళ్లీ గోదావరి జిల్లాల అందాలను ఎలా చూపించబోతోన్నారు అనే దానిపై ఓ స్పష్టత వచ్చింది. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని ప్రకటించారు. రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ వదిలిన పోస్టర్ సైతం అందరినీ ఆకట్టుకుంటోంది.

ఏప్రిల్ 5న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ‘మనసులో పుట్టే ప్రేమ మచ్చలేనిదైతే ఆ ప్రేమకు మరణం కూడా మనతోనే’ అనే డైలాగ్ ఆ పోస్టర్ మీద హైలెట్‌గా నిలిచింది. ఆ డైలాగ్ద‌తో సినిమా సారాన్ని చెప్పేశారు. శశివదనే స్వచ్చమైన గ్రామీణ ప్రేమ కథగా ప్రేక్షకుల ముందుకు. ఏప్రిల్ 5న రానుంది. ఈ చిత్రంలో రంగస్థలం మహేష్, శ్రీమాన్, జబర్దస్త్ బాబీ, ప్రవీణ్ యండమూరి మరియు దీపక్ ప్రిన్స్ కీలక పాత్రలు పోషించారు.

నటీనటులు: రక్షిత్ అట్లూరి, కోమలి, శ్రీమన్, దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ, రంగస్థలం మహేష్

సాంకేతిక బృందం
చిత్రం: శశివదనే
బ్యానర్: AG ఫిల్మ్ కంపెనీ, SVS స్టూడియోస్
సమర్పణ : గౌరీ నాయుడు
రచన & దర్శకత్వం: సాయిమోహన్ ఉబ్బనా
నిర్మాతలు: అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోదాల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శ్రీపాల్ చొల్లేటి
సంగీతం: శరవణ వాసుదేవన్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: అనుదీప్ దేవ్
సినిమాటోగ్రఫీ: శ్రీ సాయికుమార్ దారా
ఎడిటర్: గ్యారీ బీహెచ్
కొరియోగ్రాఫర్ – జెడి
కాస్ట్యూమ్ డిజైనర్: గౌరీ నాయుడు
నిర్మాణం: AG ఫిల్మ్ కంపెనీ
సీఈవో: ఆశిష్ పెరి
పీఆర్వో: నాయుడు – ఫణి

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్