ములుగు జిల్లా రాజుపేట కెనరా బ్యాంక్‌లో భారీగా గోల్‌మాల్ జరిగిన సంగతి ఆలస్యంగా వెలుగు చూసింది. బ్యాంక్ అప్రైజర్ కోటి 38 లక్షలు విలువ చేసే రెండు కిలోల బంగారాన్ని కొట్టేసి పరారయ్యాడు. ఇటీవల బ్యాంక్ జరుగుతున్న వార్షిక ఆడిట్ క్రమంలో ఈ మోసం బయటపడింది. ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారం నిల్వల్లో ఏ మాత్రం పొంతన కుదరకపోవడంతో ఆడిట్ అధికారులు ఆరా తీశారు. అయితే, ఇది అప్రైజర్ పనేనని తెలుసుకున్న బ్యాంక్ మేనేజర్ అతని జాడ కోసం వెతకగా అప్పటికే భార్య పిల్లలతో ఉడాయించినట్టు తెలిసింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు బ్యాంక్ అధికారులు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక బాధితులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూసుకుంటామని, ప్రస్తుతమున్న ధర ప్రకారం డబ్బులు ఖాతాలో వేస్తామని భరోసా ఇవ్వడంతో ఖాతాదారులు ఊపిరిపీల్చుకున్నారు.
రాజుపేట కెనరా బ్యాంక్‌లో ఖాతాదారుడి గోల్డ్ గోల్‌మాల్
0
249
Previous article
Next article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


