హైదరాబాద్ లో మారిన వాతావరణం.. పలు చోట్ల భారీ వర్షం

హైదరాబాద్(Hyderabad)లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నిన్నటి వరకు ఎండలతో ఉక్కిరిబిక్కిరి అయిన నగరవాసులకు కాస్త ఉపశమనం లభించింది. గురువారం ఉదయం నుంచే మబ్బులు కమ్ముకోవడంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. మధ్యాహ్నం నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. హైద‌రాబాద్ స‌మీపంలోని వికారాబాద్(Vikarabad ), సంగారెడ్డి(Sangareddy) జిల్లాల వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రెండు జిల్లాల్లో పలు చోట్ల వడగండ్ల వ‌ర్షం కురిసింది. మరోవైపు వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం క‌ల‌గ‌కుండా అధికారులు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. కాగా వచ్చే ఐదు రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు.

Latest Articles

రక్తం అమ్ముకుని సంపాదించాల్సిన అవసరం ఉందా..? బ్లడ్ బ్యాంక్ వివాదంపై చిరంజీవి

ఎన్ని విమర్శలు వచ్చినా.. బ్లడ్ బ్యాంక్ విషయంలో మాత్రం మెగాస్టార్ చిరంజీవి తన వాదనను మరోసారి స్పష్టంగా వినిపించారు. గతంలో తన బ్లడ్ బ్యాంక్ చుట్టూ రేగిన వివాదాన్ని ప్రస్తావిస్తూ.. రక్తాన్ని అమ్ముకుని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్