ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)కు మరోసారి ఈడీ నోటీసులు జారీచేసింది. ఈ నెల 20న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈరోజు కవిత విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. అనారోగ్యం కారణంగా హాజరుకాలేనని తన లాయర్ ద్వారా ఈడీకి లేఖను అందజేశారు. ఈ లేఖపై సానుకూలంగా స్పందించిన అధికారులు వచ్చే సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. కాగా లిక్కర్ స్కాం కేసులో ఈనెల 11న కవితను 9గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన ఈడీ అధికారులు.. 16న మళ్లీ విచారణకు హాజరవ్వాలని నోటీసులు ఇచ్చారు.