ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన పుతిన్

    రష్యా అధ్యక్షునిగా వ్లాదిమిర్‌ పుతిన్‌ ఐదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యాంగాన్ని తనకు అనుకూలంగా మార్పులు చేర్పులు చేసుకున్న పుతిన్.. రికార్డు స్థాయిలో ఐదోసారి రష్యా అధ్యక్షుడి పదవీ ప్రమాణస్వీకారం చేశారు. మాస్కోలోని అధికార అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌ ప్యాలెస్‌లో సుమారు 2 వేల 500 మంది అతిథుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం లో పుతిన్‌ రష్యా రాజ్యాంగంపై చేయి ఉంచి, పదవీ ప్రమాణం చేశారు. అమెరికా సహా పలు పశ్చిమ దేశాలు ఈ కార్య క్రమానికి హాజరు కాలేదు. పుతిన్ 1999లో రష్యా పగ్గాలు అందుకున్నారు. ఆయన 2030 వరకు అధ్యక్ష పదవిలో కొనసాగేలా రాజ్యాంగంలో అనుకూల మార్పులు చేసుకున్నారు. ఇప్పటికే 25 ఏండ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న పుతిన్‌.. జోసఫ్‌ స్టాలిన్‌ తర్వాత అత్యధిక కాలం రష్యాను పరిపాలించిన నేతగా నిలువనున్నారు. గత 25 ఏళ్లుగా రష్యాలో పుతిన్ నాయకత్వం అప్రతిహతంగా కొనసాగుతోంది. మార్చిలో జరిగిన ఎన్నికల్లో ఆయనకు పెద్దగా పోటీ నిచ్చే విపక్ష నేత లేకపోవడంతో మరోసారి ఘన విజయం సాధించారు.

Latest Articles

పులివెందులను కాపాడుకోవడానికి వైఎస్ జగన్ ఏం చేయబోతున్నారు?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే పులివెందుల నియోజకవర్గం ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న ఆ గడ్డపై, ఇప్పుడు ఆధిపత్య పోరు రసవత్తరంగా మారుతోంది. ఈ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్