Chandrababu: సైకో జగన్‌కు ఎక్స్‌పైరీ డేట్‌ దగ్గర పడింది… 6 నెలల్లో ఇంటికి పోతాడు..!

స్వతంత్ర వెబ్ డెస్క్: సీఎం జగన్‌పై(CM Jagan) చంద్రబాబు(Chandrababu) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సైకో జగన్‌కు ఎక్స్‌పైరీ డేట్‌ దగ్గర పడింది. ఆరు నెలల్లో ఇంటికి పోతాడని టీడీపీ(Tdp) అధినేత చంద్రబాబు చెప్పారు. ఇసుక తవ్వకాలు, అమ్మకాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రెండో రోజు పర్యటనలో భాగంగా రావులపాలెం మార్కెట్‌ రోడ్డులో గురువారం రాత్రి జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

‘నువ్వంటూ ఒక్క పనిచేశానని చెప్పే ధైర్యం ఉందా? నేనైతే ధైర్యంగా చెబుతా.. కొన్ని వందల పనులు చేశాను. కానీ నువ్వు అధికారంలోకి వచ్చాక అమరావతిని(Amaravathi) నాశనం చేశావు, పోలవరాన్ని(Polavaram) గోదావరిలో కలిపేశావు. పరిశ్రమలు తరిమేసి పిల్లల పొట్టకొట్టే పరిస్థితికి వచ్చావు. రుషికొండను కూడా బోడిగుండు చేశావు.

మాట్లాడితే నా బీసీలు(Bc), నా ఎస్సీలు(Sc) అంటాడు. మీ బిడ్డను అంటాడు.. మీ బిడ్డ కాదు కేన్సర్‌ గడ్డ. అది ఏ పార్టుకు వస్తే ఆ పార్టు తీసివేయాలి. ఒక్క చాన్సంటూ వచ్చాడు. ముద్దులు పెట్టాడు. ఇప్పుడు గుద్దులే.. గుద్దులు. సమాజాన్ని భయపట్టే స్థితికి వచ్చాడు. నోరు విప్పితే నాకు ఏమీ లేదంటాడు. సాక్షి పేపరు లేదా.. సాక్షి చానల్‌ లేదా? అబద్ధాలపుట్ట.

రూ.60 ఉండే మందు ఇప్పుడు రూ.200. రావులపాలెంలో జగ్గిరెడ్డి(Jaggireddy) మద్యం వస్తుందన్నారు. రాష్ట్రంలో ఇసుక దోపిడీ ఏ స్థాయిలో జరుగుతుందో చెప్పడానికి జొన్నాడ ఇసుక రీచ్‌ నిదర్శనంగా నిలుస్తుందని చంద్రబాబు అన్నారు. ఇక్కడ ఇసుక దొంగలు రెడ్‌ హ్యాండెండ్‌గా దొరికారని, ప్రజాప్రతినిధుల ముసుగులో విచ్చలవిడిగా ఇసుక దోపిడీ జరుగుతోందని విమర్శించారు. ప్రజల సంపదను ఎమ్మెల్యేలు, మంత్రులు దోచేస్తుంటే ఈ సీఎంకు సిగ్గూ ఎగ్గూ లేవని అన్నారు.

చంద్రబాబు ఆలమూరు వద్ద కాన్వాయ్‌ దిగి ఆర్టీసీ బస్సులో(RTC) ప్రయాణం చేశారు. అందులో ప్రయాణిస్తున్న మహిళలతో కొద్దిసేపు మాట్లాడారు. వారి కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు. నాలుగేళ్ల కాలంలో నిత్యావసరాల ధర, కరెంట్‌, బస్సు చార్జీలు ఎలా పెరిగాయని ఆరా తీశారు. కొండలా కనిపిస్తున్న ఇసుక నిల్వలను చూసి బస్సు ఆపి అక్కడ దిగిపోయారు.

టీడీపీకి (TDP )వెన్నెముకగా ఉన్న బీసీల కోసం ప్రత్యేక పాలసీ తీసుకొస్తానని, వారిలో ఉన్న అన్ని ఉపకులాలకూ న్యాయంచేసి, పేదరికం లేని సమాజాన్ని చూడాలన్నదే నా జీవితాశయం. కచ్చితంగా అమలు చేసి నిరూపించుకుంటా. మహిళల బంగారు భవిష్యత్‌కు బాబు గ్యారెంటీ అని అన్నారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్