టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ద్వారా జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా ప్రస్తుత టీటీడీ బోర్డు పదవీకాలానికి అనుగుణంగా శ్రీ వేంకటేశ్వర దేవాలయాలైన జూబ్లీహిల్స్, కరీంనగర్, హిమాయత్‌నగర్ లోకల్ అడ్వైజరి కమిటీ సభ్యునిగా సినీ నిర్మాత మోహన్ ముళ్ళపూడి నియమితులయ్యారు. ఈయన గతంలో పలు సినిమాలకు నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించారు. అలాగే ఫిలింనగర్ కల్చరల్ సెంటర్(FNCC)కు హానరబుల్ సెక్రెటరీగా వ్యవహరిస్తున్నారు. అలాగే ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర దేవాలయాల లోకల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ గా బాధ్యతలు చేపట్టారు. జూబ్లీహిల్స్, కరీంనగర్, హిమాయత్‌నగర్‌లోని టీటీడీ దేవాలయాల మొత్తం అభివృద్ధిలో.. కరీంనగర్‌లో నిర్మిస్తున్న కొత్త ఆలయానికి సంబంధించిన పనులలో లోకల్ అడ్వైజరి కమిటీ మెంబర్ గా చేపట్టిన బాధ్యతలను నిర్వహిస్తారు.
టీటీడీ ఎల్‌ఏసీ సభ్యుడిగా నిర్మాత మోహన్ ముళ్లపూడి
0
301
Latest Articles
నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ ఇళ్లలో ఏసీబీ సోదాలు
హైదరాబాద్‌లోని నిమ్స్‌లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో అవినీతి శాఖ అధికారులు రంగంలోకి దిగారు. నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ ఇళ్లలో, కార్యాలయంలో ఒకేసారి తనిఖీలు...
- Advertisement -
- Advertisement -


