తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన

ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన కోసం తెలంగాణకు వస్తున్నారు. ఇవాళ ఆదిలాబాద్‌, రేపు సంగారెడ్డిలో మోదీ పర్యటించబోతున్నారు. ఇందుకోసం 9 గంటల 20 నిమిషాలకు ప్రత్యేక విమానంలో నాగపూర్‌ చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానం ద్వారా ఆదిలాబాద్ చేరుకుని 30 నిమిషాల పాటు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 6 వేల 697 కోట్ల విలువైన పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయబోతున్నారు మోదీ. రామగుండం ఎన్టీపీసీలో 6 వేల కోట్లతో నిర్మించిన రెండో థర్మల్‌ పవర్‌ యూనిట్‌ను జాతికి అంకితం చేస్తారు. 70 కోట్లతో నిర్మించిన అంబారి- ఆదిలాబాద్‌- పింకాలకుట్టి రైల్వైలైన్‌ జాతికి అంకితం చేస్తారు. వీటితో పాటు 491 కోట్లతో ఆదిలాబాద్‌- బేలా మధ్య NH 353B పై 2 లైన్స్‌ నేషనల్ హైవే విస్తరణకు శంకుస్థాపన చేస్తారు. అదే విధంగా 136 కోట్లతో చేపట్టబోతున్న హైదరాబాద్- భూపాలపట్నం రహదారికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం పార్టీ పరంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు.

    ఆదిలాబాద్‌ టూర్‌ తర్వాత తమిళనాడుకు వెళ్లబోతున్నారు. చెన్నైలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొని రాత్రి 7 గంటల 45 నిమిషాలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ చేరుకుని రాజ్‌భవన్‌లో బస చేస్తారు. రేపు సంగారెడ్డిలో పర్యటించబోతున్న మోదీ 9వేల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించబో తున్నారు. మొదట బేగంపేట్‌ ఎయిర్‌పోర్టులో 400 కోట్లతో నిర్మించిన పౌర విమానయాన పరిశోధనా సంస్థను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు ప్రధాని. ప్రధాని మోదీ టూర్‌ నేపథ్యంలో హైదరాబాద్‌ లో ఇవాళ రేపు పలు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు పోలీసులు

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్