వైద్యం వికటించడంతో నిండు గర్భిణీ మృతి చెందిన సంఘటన, హైదరాబాద్ బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. శంషాబాద్‌కి చెందిన శాంతి గత తొమ్మిది నెలల నుంచి మోతి నగర్‌లోని పద్మప్రియ ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటుంది. ఈనెల 27న గర్భిణీకి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడ డబ్బులు కట్టించుకోని ఆసుపత్రిలో వసతులు లేవని ఎస్సార్ నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు వైద్యురాలు. అక్కడ ఇద్దరు పిల్లలకు ప్రసవించిన తర్వాత గర్భిణీ ఆరోగ్యం బాగాలేదని, అమీర్‌పేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని పద్మప్రియ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో బోరబండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బోరబండలో వైద్యం వికటించి గర్భిణీ మృతి
0
229
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


