Free Porn
xbporn
24.2 C
Hyderabad
Thursday, July 25, 2024
spot_img

నీట్ పరీక్ష వాయిదా ఎవరికి నష్టం ?

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో నీట్ పోస్టు గ్రాడ్యుయేషన్ పరీక్ష వాయిదా పడింది. నీట్ పరీక్ష నిర్వహణకు సంబంధించి కొంతకాలంగా విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిం చారు. నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ కావడంతో విద్యార్థులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు నిర్వహిం చారు. ఈ నేపథ్యంలో కొన్ని గంటల్లో జరగాల్సిన నీట్ పీజీ ప్రవేశ పరీక్షను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. నీట్ పీజీ ప్రవేశ పరీక్షకు దేశవ్యాప్తంగా లక్షలాదిమంది ప్రిపేర్ అయ్యారు. వీరంతా వేలాది రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ కేంద్రాల్లో శిక్షణ కూడా తీసుకున్నారు. ఇంత పెద్ద మొత్తం ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకున్న విద్యార్థుల శ్రమకు ఫలితం లేకుండా పోయింది.

అంతకుముందు వైద్య విద్య కోర్సు ప్రవేశాలకుగాను నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీని నిరసిస్తూ హైదరా బాద్‌లో విద్యార్థి లోకం కదం తొక్కింది. నీట్ పరీక్షను వెంటనే రద్దు చేసి, మళ్లీ పరీక్షలు నిర్వహించాలని విద్యార్థి, యువజన సంఘాల నేతలు డిమాండ్ చేశారు. లేకపోతే ఢిల్లీని ముట్టడించ డానికి కూడా వెనుకాడబోమని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విద్యార్థి లోకం మరో అడుగు ముందుకేసింది. నీట్ ప్రశ్నా పత్రం లీకేజీపై వెంటనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బహిరంగ క్షమాపణ చెప్పాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహా రంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ చేపట్టాలని నీట్ విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ హైదరాబాద్‌ లో స్టూడెంట్ మార్చ్ ను నిర్వహించింది. పేపర్ లీక్ వ్యవహారంపై ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల అధినేతలు వెంటనే స్పందించాలని కోరారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థు లకు న్యాయం చేయాలని కోరారు. దేశవ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించి నీట్ పరీక్ష ప్రశ్నా పత్రాన్ని దాదాపు నలభై లక్షల రూపాయలకు అమ్ముకుని విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రెండు సెంటర్లలో అవకవతవకలు జరిగాయని సాక్షాత్తూ కేంద్ర విద్యాశాఖా మంత్రి అంగీకరించిన నేపథ్యంలో నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేసి తక్షణమే మళ్లీ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు.ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నీట్ పీజీ ప్రవేశ పరీక్షను వాయిదా వేసే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుం ది. అయితే ప్రవేశ పరీక్షను ఎప్పుడు నిర్వహించేదీ కేంద్రం వెల్లడించలేదు. పరీక్ష నిర్వహించే కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పరీక్ష వాయిదా వేయడంతో విద్యార్థులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా, ప్రవేశ పరీక్ష పవిత్రతను కాపాడటానికి వాయిదా నిర్ణయాన్ని తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

వాస్తవానికి ఆదివారం నీట్ – పీజీ ప్రవేశపరీక్ష జరగాల్సి ఉంది. దీంతో దేశవ్యాప్తంగా విద్యార్థులు సదూరు ప్రాంతాల నుంచి పరీక్ష జరిగే నగరాలు, పట్టణాలకు చేరుకున్నారు. అయితే ఒక్కసారిగా ప్రవేశ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు శనివారం రాత్రి కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో అప్పటికే నగరాలు, పట్టణాలకు చేరుకున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. దీంతో ఉసూరుమంటూ ఇంటి బాట పట్టారు. నీట్ – పీజీ ప్రవేశ పరీక్ష ను వాయిదా వేసిన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ వివరణ ఇచ్చారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యతే తమకు ముఖ్యమన్నారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్.

నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహణకు సంబంధించిన లోపాలు ఇటీవల బయటపడ్డాయి. దీంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమయ్యాయి. పెద్ద పెద్ద నగరాల్లో ఈ మేరకు తీవ్ర స్థాయిలో ఆందోళనలు జరిగాయి. కాగా ప్రవేశ పరీక్షల నిర్వహణకు సంబంధించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ను రద్దు చేయాలన్న డిమాండ్లు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. పేపర్ల లీకేజీ విషయంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంస్థపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. 1563 మంది అభ్యర్థులకు గ్రేస్ మార్కులు కలిపిన విషయాన్ని ప్రస్తావించకపోవడం పట్ల నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంస్థను సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించింది. జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షల విశ్వసనీయతను పరిరక్షించే విషయంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఘోరంగా విఫలమైందని సర్వోన్నత న్యాయస్థానం మండిపడింది. గ్రేస్ మార్కులు రద్దు చేసి, మళ్లీ పరీక్షలను నిర్వహిస్తామన్న ఎన్టీఏ ప్రకటనపై సుప్రీంకోర్టు మరింతగా ఆగ్రహించింది.ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి, తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత చదువులకు పంపడానికి సిద్ధమవుతుండగా, మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామనడం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుకోవడమేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యా నించింది.

   నీట్ – పీజీ ప్రవేశపరీక్షను తమిళనాడు ప్రభుత్వం మొదటినుంచి వ్యతిరేకిస్తోంది. ఈ పరీక్షల ప్రశ్నా పత్రాలు లీక్ కావడం, దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగడంతో తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తమ వాదన రుజువైంది అంటూ ప్రకటన చేయడం విశేషం. వాస్తవానికి 2017 వైద్య విద్య ప్రవేశాల కోసం నీట్ అనే సంస్థ పరీక్షలు నిర్వహించడం ప్రారంభమైంది. అప్పటివరకు రాష్ట్రాల్లో వైద్య విద్య ప్రవేశాల కోసం ఎంసెట్ పేరుతో పరీక్ష నిర్వహించే పద్ధతి ఉండేది. అయితే ఈ ఎంసెట్ పద్ధతికి స్వస్తి పలికి నీట్ పేరుతో వైద్య విద్యలో ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్షలు నిర్వహించే కొత్త సంప్రదాయానికి కేంద్ర ప్రభుత్వం అంకురార్పణ చేసింది. అయితే నీట్ ప్రవేశ పరీక్ష విధానంపై మొదటి నుంచి అనుమానాలు తలెత్తుతున్నాయి. వాస్తవానికి దేశవ్యాప్తంగా ప్రవేశపరీక్షలు నిర్వహించడం కత్తి మీద సామే. అటువంటప్పుడు ప్రవేశపరీక్షలు నిర్వహిణకు సంబంధించి ఆయా రంగాలకు చెందిన నిపుణుల సహాయ, సహకారాలు అందరూ తీసుకోవాలి. ప్రవేశపరీక్ష ఎలా నిర్వహించాలనేదానిపై ముందు గా కసరత్తు చేయాలి. అయితే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటువంటి కసరత్తు ఎక్కడా చేసినట్లు కనపడదు. ప్రవేశ పరీక్షల నిర్వహణలో లోపాలపై గడచిన కొన్ని రోజులుగా దేశంలో హల్‌చల్ నడిచింది. అయితే ఇంత కీలక అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించకపోవడాన్ని కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ తప్పుపట్టారు. ప్రవేశ పరీక్షలు సజావుగా నిర్వహించే అంశాన్ని కేంద్రం ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని రాహుల్ గాంధీ మండిపడ్డారు. విద్యాశాఖలో కొందరు ముఖ్య నాయకులను బాధ్యులు చేసి తప్పుకుందామని ప్రధాని నరేంద్ర మోడీ భావిస్తున్నట్లు రాహుల్ గాంధీ విమర్శించారు. పరీక్షా విధానాల్లో లోపాలు తలెత్తినప్పుడు ఇందుకు ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని రాహుల్ గాంధీ వాదిస్తున్నారు.

Latest Articles

బీఆర్‌ఎస్‌ ఓటమి తర్వాత తొలిసారి సభకు కేసీఆర్‌

బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ఇవాళ తెలంగాణ బడ్జెట్ సమాశాలకు హాజరుకానున్నారు. బీఆర్‌ఎస్‌ ఓటమి తర్వాత తొలిసారి ప్రతిపక్ష నేతగా శాసనసభలో అడుగుపెట్టనున్న నేపథ్యంలో కేసీఆర్‌ రాకపై ఆసక్తి నెలకొంది. కేసీఆర్ ఏం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్