Patna Railway Station |ప్రయాణికులతో కిక్కిరిసి ఉన్న ఆ రైల్వేస్టేషన్ లో ఒక్కసారిగా అసభ్యకర దృశ్యాలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. బిహార్ రాష్ట్రంలోని పట్నా రైల్వేస్టేషన్ లో ఉన్న టీవీల్లో ప్రకటన స్థానంలో పోర్న్ సీన్స్ ప్రసారమయ్యాయి. దాదాపు మూడు నిమిషాల పాటు ఆ దృశ్యాలు టీవీలపై దర్శనమిచ్చాయి. దీంతో ప్రయాణికులు ఆగ్రహంతో రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు.. వెంటనే ఆ అసభ్య చిత్రాల ప్రసారాన్ని ఆపివేయాలని ప్రకటనల కాంట్రాక్టు తీసుకున్న దత్తా కమ్యూనికేషన్స్‌కు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా దత్తా కమ్యూనికేషన్స్ కాంట్రాక్టును రద్దు చేయడంతో పాటు జరిమానా విధించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
Read Also: రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు.. వారి వివరాలు ఇవ్వాలని ఆదేశం
Follow us on: Youtube Instagram