స్వతంత్ర టీవీ, వెడ్ డెస్క్: మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిపై మరో మాజీ మంత్రి పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుడివాడ ఆర్టీసీ బస్ డిపో ప్రారంభోత్సవంలో పాల్గొన్న పేర్ని.. గుబురు గడ్డం, మెడలో రుద్రాక్షలు, నోట్లో కిళ్లీతో కొడాలి నాని రౌడీలా ఉంటారు కానీ ఆయన బుర్ర మాత్రం పాదరసం కంటే అత్యంత వేగంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఏడో తరగతి వరకు మాత్రమే చదివానని కొడాలి నాని చెప్పుకుంటాడు కానీ ఈ రాష్ట్రంలోనే అత్యంత తెలివైన రాజకీయ నాయకుడని కొనియాడారు. కొడాలి నానిపై పోటీ చేసేందుకు ఇద్దరు పోటీ పడుతున్నారని ఆయనను ఓడించడం వాళ్ల తరం కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గం నుంచి ఐదవసారి కూడా బంపర్ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలనున్నారని పేర్ని నాని తెలిపారు.
కొడాలి నాని గెటప్ రౌడీలా ఉంటుంది: పేర్ని నాని
0
303
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


