మరో కన్ను సీబీఐ అరెస్ట్ వేళ.. జగన్ డైవర్షన్ డ్రామాలు

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త వాసు, ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడంపై మాజీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజురోజుకు వైసీపీ ప్రభుత్వం వేధింపులు పెరిగిపోతున్నాయని.. టీడీపీ నేతలను లొంగదీసుకోవడానికి అక్రమ కేసులు పెడుతోందని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీకి ఫోన్ చేసి ఆమెకు ధైర్యం చెప్పారు.

వైసీపీలో చేరలేదనే అక్కసుతోనే ఆదిరెడ్డి కుటుంబంపై సీఎం జగన్ కక్ష సాధింపులకి పాల్పడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. ఒక కన్నుని పొడిచిన మరో కన్నుని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసే వేళ.. ఆదిరెడ్డి కుటుంబాన్ని సీఐడీ అదుపులోకి తీసుకోవడం జగన్ స్టైల్ డైవర్షన్ డ్రామా అని ఎద్దేవా చేశారు. ఫిర్యాదులే లేని కేసుల్లో టీడీపీ బీసీ నేతలైన ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసులని అదుపులోకి తీసుకోవడం ఏ1 దొంగ పాలనలోనే సాధ్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా ఆదిరెడ్డి కుటుంబం నిర్వహిస్తున్న జగత్‌జనని చిట్స్‌ వ్యవహారంలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో వారిద్దరినీ సీఐడీ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది.

Latest Articles

ఈటల ఫ్లెక్సీ రచ్చపై స్పందించిన రామచందర్‌రావు.. కొందరు కుట్రలు చేశారు

ఈటెల రాజేందర్ మీద వచ్చిన అభియోగాలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షులు రామ్ చందర్ రావు స్పందించారు. ఈటెల ఏడుపు బీజేపీకి శాపం అంటూ హైదరాబాద్ లో బ్యానర్లు, పోస్టర్లు వెలిశాయి. బ్యానర్లు, పోస్టర్లు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్