స్వతంత్ర, వెబ్ డెస్క్: చంద్రబాబు ప్రవేశ పెట్టింది మోసఫెస్టో అని ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలని వైసీపీ శ్రేణులకు సూచించారు మంత్రి అంబటి రాంబాబు. గడప గడపకు వెళ్ళి ధైర్యంగా మేము మేనిఫెస్టో ఇస్తున్నామని అన్నారు. వైసీపీ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో మేనిఫెస్టో అంటే జగన్ చర్చా కార్యక్రమంలో మంత్రి అంబటి పాల్గొని ప్రసంగించారు. గతంలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చ లేని వ్యక్తి చంద్రబాబు.. తను ప్రవేశ పెట్టిన మేనిఫెస్టో ను ఎవరూ చూడకుండా తగలబెట్టేశాడని అన్నారు. రెండు పార్టీలు ప్రవేశ పెట్టిన మేనిఫెస్టో పై ప్రజల మధ్య చర్చలు జరగాలని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి కావటం తథ్యమన్నారు. గతంలో నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేసే సమయంలో మేనిఫెస్టో గురించి పట్టించుకునే వారిమే కాదని అన్నారు. మేనిఫెస్టో అంటే ఒక బైబిలు, ఒక ఖురాన్, ఒక భగవద్గీత గా భావించి అమలు చేసే గొప్ప ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు.


